పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశం అంతటా జరిగిన ఆయ నృత్య ప్రదర్శనాలు విశేషంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆయన 82 సంవత్సరాలు జీవించి 1957 జూలై 13 వ తేదీన హైదరాబాదులో కీర్తి శేషులైనారు.

హరిపున్నయ్య:

కూచిపూడి నృత్య నాటక సంప్రదాయంలో, భయానక, భీభత్స, రౌద్ర, వీర రసాలను పోషించే పాత్రలను ధరించి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసి సుప్రసిద్ధ కళాకారులుగా వెలుగొందారు హరి పున్నయ్య గారు. వీరిది కూచిపూడి గ్రామం చిరకాలంగా కళాలక్ష్మిని ఆరాధించిన కళాజీవి.

హరి పున్నయ్య
సాత్విక వేషాల్లో సై అనిపించుకొన్న సవ్యసాచి:

కూచిపూడి వీథి నాటకాలలో సాత్విక పాత్రల్ని రసవంతంగా అభినయించడంలో ఆరితేరినవారు వేదాంతం రామకృష్ణయ్యగారు. యక్షగాన విద్యలోనూ, కలాప విద్యలోనూ అపారమైన జ్ఞానాన్ని ఆర్జించిన ప్రముఖ కళాకారులు. వృద్ధాప్యంలో సంగీత నాటక అకాడమీ వారి పారితోషికాలు పై సైతం పొందుతున్నారు.