పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధరించటం విరమించి నంగె గడ్డలో కళావంతులకు వారికి నచ్చిన విద్యనంతా నేర్పి, ఆ గ్రామంలో ఏడెనిమిది మేళాల్ని తయారు చేశారు.

నాట్యకళానిధి వేదాంతం:

కూచిపూడి నాట్య కళా కారులలో అగ్ర శ్రేణికి చెందిన వారిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ నాట్య కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారు.

యక్షగానాలూ, వీధి భాగవతాల్లో పారంపర్యంగా వచ్చే సాధారణ నృత్యాల బాణీకి భిన్నంగా శాస్త్రిగారు కొత్తపద్ధతి అనుసరించారు. భరతనాట్య శాస్త్ర సంప్రదాయాల ఆధారంతో శ్రీ నారాయణతీర్థుల కృష్ణలీలా తరంగిణి

వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి

తరంగాలకు, శ్రీ జయదేవ కవి అష్టపదులకు, క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలకు, కృష్ణకర్ణామృతం, పుష్ప బాణ విలాసం శ్లోకాలకు నృత్యాలు సరికొత్తగా లల్పించి, ప్రధాన పాత్రల లక్షణాలు, మనస్తత్వాలు నిరూపించి, శాస్త్రోక్తంగా ఒక నూతన నాట్యశాస్త్రమే కల్పన చేసి, శిష్య ప్రశిష్యుల్ని తయారు చేసి ఆంధ్ర దేశానికి ప్రసాదించిన మహానీయులు వీరు. భామాకలాపంలో సత్యభామ నాయిక, సత్యభామ పాత్ర నిర్వహణలో అపూర్వంగా అఖండ ప్రజ్ఞ ప్రదర్శించిన వ్వక్తి ఈయన. ఈయన ఒక్క భామాకలాపం, గొల్ల కలాపాలే కాకుండా, దాదినమ్మ వేషం, లీలావతి విజయంలో బాలింత వేషం, శ్రీ కృష్ణ జననం మొదలైన యక్షగానాల పాత్రలనూ అత్యద్భుతంగా నిర్వహించేవారు.