Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోటీలవల్ల కుళ్ళు బుద్ధితోనూ ఒకరిమీద ఒకరు మంత్ర ప్రయోగాలు చేసుకునేవారు. అలా ప్రయోగించిన ప్రయోగాలలో మచ్చుకు ఒక ఉదాహరణ:

కుక్కకాటుకు చెప్పు దెబ్బ:

ఒకసారి మన భాగవతులు మలయాళ దేశానికి సంచారం వెళ్ళగా ఒక గ్రామంలో వీరి ప్రదర్శనానికి అనుమతి ఇవ్వలేదు. కారణం ఆ గ్రామంలో ఒక మంత్ర వేత్త వున్నాడట. అతని అనుమతి లేక ఎవరూ ప్రదర్శన ఇవ్వకూడదట. అయినా మన కూచిపూడి వారు ఆ మంత్ర వేత్తని లెక్క చేయకుండా ప్రదర్శనాన్ని యివ్వడానికి నిర్ణయించుకున్నారు.

ఆనాడు ఉదయం మన భాగవత శిఖామణి భాగవతుల దశరథరామయ్య గారు ఆ మలయాళ మాంత్రికుని ఇంటికి వెళ్ళాడు. మాంత్రికుడు ఇంటివద్ద లేడు. ఈయన ఆ మాంత్రికుని భార్యను చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అర్థించగా ఆమె నిప్పు ఇవ్వడం, ఈయన చుట్ట కాల్చుకోవడం, తదనంతరం ఆ అగ్నిని ఈయన గుడ్డలో మూట గట్టుకొని వెళ్ళి పోవడం జరిగిందట. ఎక్కడికో వెళ్ళివచ్చిన మలయాళ మాంత్రికునికి భార్య ఈ వృత్తాంతం చెప్పగా అతగాడు మండిపోయి ఆనాటి ప్రదర్శనంలో ప్రతి క్రియగా భామావేష కారునికి కడుపుబ్బునట్లు జలోదర ప్రయోగం చేశాడట. ఇంకేముంది? దశరథ రామయ్య గారు చూచి కించిత్తు చలించకుండా, 'చూడు నా తడాఖా ' అని ప్రతీకారంగా ఒక గంటాన్ని తీసుకుని ఒక స్థంభాన్ని పొడవగా ఆరంధ్రం నుంచి నీరు కారడం ప్రారంభించి, భామ వేషధారికి కడుపు నొప్పిచట్టున తగ్గిందట.

దెబ్బపై దెబ్బ:

దశరథ రామయ్యగారు అంతలో ఊరుకోలేదు. మలయాళ మాంత్రికునికి ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాడు. వెంటనే ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న మలయాళ మాంత్రికుణ్ణి కదల లేకుండా కూర్చున్నట్లే బంధించి వేశాడు. ప్రదర్శనం తెల్లవారులు జరిగింది. కాని మాంత్రికుడు కదలలేదు. ప్రదర్శనం ఆ సాంతమై అందరూ వెళ్ళిపోయారు. కాని ఆ మాంత్రికుడు మాత్రం శిలలా అలాగే కూలబడి వున్నాడు. ఈ స్థితిని చూచిన మాంత్రికుని భార్య దశరథ రామయ్య గారిని వేడుకోగా ఆయన జాలి దలచి మంత్ర బంధనాన్ని సడలించాడు. తరువాత మాంత్రికుడు ఇల్లు చేరాడట. ఈ