పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాకు ఝేకుకు ఝేకు రేకిణ
సారెసారెకు పరశురాముని
సన్నుతించె నీరజాక్షవినయా
రతిరతిందరి
తాకిణాంగ ఝేకిణాంత
రవికులాంబుధి సోమ దశరథ
రామచంద్ర నిండుపున్నమ
వెన్నెలాయెర మన్నెధీర
భళిర మేల్ సెబాసు సల్లాముర!

అని దీవించేవారు. వారు ఈ విధంగా తురుష్క ప్రభువుల్ని మెప్పించి అనేక జాగీర్లను పొందారు. అలాంటివే పైన వివరించిన బనగాని పల్లె నవాబు వ్రాసి యిచ్చిన గ్రామాలు కోటకొండ _కపట్రాల.

రాచగద్దె ఎక్కిరాణ కెక్కిన వేదాంతం సాంబయ్య:

వేదాంతం సాంబయ్యగారనే కూచి పూడి భరతనాట్యాచారుడు 18 వ శతాబ్దంలో అనంతశయనం మహారాజుగారి ఆస్థానంలో ప్రవేశించి తన పాండిత్య ప్రావీణ్యాన్ని, నటనాకౌశల్యాన్ని ప్రదర్శించాడు. అనంతశయనం మహారాజు అబ్బురపడ్డాడు. ఆయనను తన సింహాసనం మీద ఒక గంట కాలం తృప్తిదీరా కూర్చుండ బెట్టి సువర్ణహస్త కంకణాలను ధరింప జేసి సాంబయ్యగారిని సన్మానించాడు.

ఆశక్త దుర్జనత్వం, మంత్ర తంత్రాల ప్రయోగం:

కూచిపూడి వారు వుధృతంగా ప్రదర్శనాలిస్తున్న రోజుల్లో చాతబడులు, మంత్ర తంత్రాలతో మచ్చుజల్లడం మొదలైనవి ఎక్కువగా వుండేవి. కళాకారుల్లో విపరీతమైన పోటీ భావం వుండడం వల్ల ఒకరికంటే ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండేవారు. శాస్త్ర పరీక్షతో పాటు ఈ మంత్ర పరీక్షలు కూడ వుండేవి. ముఖ్యంగా ఒకరిని మరొకరు జయించలే మనుకున్నప్పుడు ఈర్ష్యాభావంతోనూ, రాజాధిరాజులు, మహారాజుల మెప్పు పొందడానికి పడే