- గొల్లకలాపం తీర్చిన గొప్ప సందేహం:
గొల్లకలాపంలో నాయిక గోపకన్య. ఆమె "బ్రాహ్మణ, గోప జన్మలో ఏది ఉత్తమమైంది? బాపడు గొప్పవాడా? గోపుడు గొప్పవాడా?"అని బ్రాహ్మణునితో వాదోపవాదాలు జరుపుతుంది. ఈ గొల్ల కలాపాన్ని భగవతుల రామలింగ శాస్త్రిగారు రచించారని ప్రతీతి. గొల్ల కలాపంలో గొల్లభామ వేషం ధరించి వీథిలో చల్ల అమ్మి నట్లు అభినయిస్తూ వుండగా శిష్టాచారం గలిగిన బ్రాహ్మణుడు చల్ల కొనాలని గొల్ల భామను పిలుస్థాడు. ఇరువురూ ఏ కులం గొప్పదో అని వాదోపవాదాలు జరుపుతారు మానవ సమాజమంతా సమానంగానే సృష్టింప బడిందని, బ్రాహ్మణులు అధికం కారని వాదిస్తుంది. ఇందుకని ప్రదర్శనంలో ఇద్దరు గొల్లపడతులు చల్ల అమ్మేటట్లు వేషాలు ధరించి, భాగవతంలో వర్ణించిన పిండోత్పత్తిని గురించీ, నవమాసాల పిండచలాన్ని పిండం బయటపడిన వరువాత, ప్రపంచ సృష్టి ఏ విధంగా వుండేదీ అభినయంతో వర్ణించేవారు. ఇందులో వేదాంత చర్చ జరుగుతుంది.
- గొల్లకలాపంలో ఘనాపాటి:
ఈ భామా, గొల్ల కలాపాలలో పేరు ప్రఖ్యాతులు గడించి అనేక మన్ననలు పొందిన సిద్ధహస్తులు వెంపటి వెంకట నారాయణగారు. ఆయన తరువాత కొంత మంది ఆ పాత్రను ధరించి నప్పటికీ ఆయనతో సరితూగరనే చెప్పవచ్చు. ఎంతో కాలం - ఏళ్ళతరబడి ఈ గొల్ల కలాపాన్ని ప్రదర్శించారు. ఇదంతా యక్షగాన రూపంలో జరిగింది.
కూచిపూడి వీథి భాగవతులు భారత - భాగవత - రామాయణాల నుండి కథలను తీసుకుని యక్షగాన నాటక రూపంలో భరత నాట్యశాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి ప్రదర్శనాలను ఇస్తూవుంటారు. వీరు ప్రదర్శించిన యక్షగానాల్లో గిరిజా కళ్యాణము- కీచక వధ - హరిశ్చంద్ర -కిరాతార్జునీయం- కాళీయమర్దనం - శశిరేఖా పరిణయం - రామనాటకం-రుక్మాంగద - లవకుశ - ఉషా పరిణయం మొదలైనవి ముఖ్యమైనవి. ఈ కోవకు చెందిన పురాణ సంబంధమైన గాథలనే యక్షగానరూపంలో ప్రదర్శించే వారు. రాను