పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాను వారు ఈ యక్షాగాన రూపాలను కొంత వరకు మార్చి వీథి నాటకాలుగా ప్రదర్శించారు.

తెరమీద జడ పండితుల ప్రతా ప్రదర్శనం:

కూచిపూడి భాగవలుల ప్రదర్శనల్లో ముఖ్యంగా భామాకలాప ప్రదర్శనంలో తెర మీద ఒక జడవేసి తద్వారా తమ పాండితీ ప్రకర్షను వెల్లడించేవారు. ఈ జడ వర్ణనను పరిశీలించి తప్పులు పట్టడానికి పండిత ప్రకాండులందరూ ముందు వరుసలో వుండేవారు.

జడను 27 నక్షత్రాలతో ఒక నక్షత్రమాలగా అలంకరించి తెర వెలుపలి భాగంలో ప్రేక్షకులకు కనబడేటట్లు వ్రేలాడదీసేవారు. ఒక్కో బిళ్ళకు ఒక శ్లోకం చదివేవారు. జడ గంటల్ని నవగ్రహాలనే వారు. ఆ జడను మయుడనే శిల్పి స్వయంగా సృష్టించాడని ప్రతీతి, తలకు సూర్యుడూ, చంద్రుడూ అలంకరింప బడేవి. ఇదీ ఆ జడ స్వరూపం. ప్రదర్శన ప్ర్రారంభంలో ఈ జడ వర్ణనను ప్రదర్శిస్తూ వుండగా, ప్రేక్షకులుగా కూర్చున్న పండితుల్లో ఎవరైనా లేచి జడను గురించి ప్రశ్నిస్తే తగిన సమాధానం చెప్పి వారిని ఆశ్చర్య చికితుల్ని చేసేవారు. అలా సమాధానం చెప్పలేనట్లయితే పండితోత్తములు ఆ జడను కత్తిరించి కళాకారులను అవమానపరిచేవారు. అలాంటి సందర్భాలను రానీయకుండా వేదాంతం లక్ష్మీ నారాయణ లాంటి వుద్దండులు ఎంతో ప్రావీణ్యంతో ఒక మహా పర్వతంలా నిలబడి జడవర్ణనను పూర్తి చేసి ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసి పండితుల్ని, పామరుల్ని రంజింప జేసే వారు.

వ్యాయామం ద్వారా నాట్య శిక్షణ:

కూచిపూడి కళాకారుల నాట్యాభ్యాసం వ్వాయామంతో ప్రారంభమవుతుంది. వారు బస్కీలు తీస్తారు; దండెములను తీస్తారు. ఇలా చేయడం వల్ల అవయవ సౌష్టవం చక్కగా అమరుతుంది, తరువాత అభినయాన్ని నేర్పుతారు. నాట్యంలో పాదగతులు _ ఆళి, ప్రత్యాళి మొదలైనవన్నీ నేర్పుతారు. హస్త ముద్రల్ని, అంగ విన్యాసాల్నీ మూడు కాలాలలో అడుగులు నేర్చుకుంటారు. ఇక నాలుగవ దశలో నవరసాలను అనుభవించడం, ముక్తాయింపులు, పాటల్లోని భావాన్ని అనుసరించి భావవిన్యాసాన్ని అభ్యసిస్తారు. ఈ విధంగా