Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకాలను గురించి, విదూషక ప్రశంసలూ వున్నాయి. దీనిని బట్టి, యక్షగానాలు రంగస్తల మెక్కి వీథినాటక వైఖరులను అందంగా సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు.

యక్షగానం కూచిపూడి భాగవతుల మొదలైన వీథి నాటక ప్రదర్శకుల దృష్టి నాకర్షించిన తరువాత అది వీథినాటకంగా వర్థిల్లి జక్కుల వారితోనే ఆ సంబంధం తెగిపోయింది.

నాటకీయత కలిగి వీథుల్లో ప్రదర్శించడం వల్ల, అటువంటి వాటికి వీథినాటకాలనే పేరు వచ్చింది. తమిళదేశంలోనూ, కన్నడదేశంలోనూ ఈ వీథి నాటకాలకు "బయలాటలనీ" తెరుకూత్తు అని పిలువబడుతున్నాయి.

వీథి నాటకం లాక్షిణికుల నిర్వచనం:

గ్రామాల్లో సామాన్య ప్రజలకు వీథి నాటకాలు; బహురూపాలు మొదలైన తెర నాటకాలు ప్రదర్శించినట్లు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణలో ఉదహరింప బడింది.

జంగాలు తెరనాటకాలాడినట్లు "బైచరాజు వేంకటనాథ కవి పంచతంత్రం లోనూ, అయ్యల రాజు నారాయణకవి "హంస వింశతి" లోనూ ఉదాహరించారు.

వీధిని గురించి భరతుడు భరత నాట్య శాస్త్రంలో దేశి రూపకాల వర్ణనలో కథ కల్పితమనీ, రెండు మూడు పాత్రలు కలిగిన ఏకాంతమనీ, నటునికి శృంగారసం ప్రధానమనీ ప్రస్తావన, ముఖ నిర్వహణ సంధులు వుండాలనీ, గీత నృత్తాదులతో కూడిన ప్రశంసలు ఉండవచ్చుననీ బాణంవలె ఇది వర్ణన ప్రధానమనీ, వ్యాఖ్యానించారు.

ధనికుడు వీథి నాటకాన్ని గురించి, వీథులలోని మార్గపంక్తులవలె తీర్చబడిన వీధి అంగములు కలవని నిర్వచించారు. వీథి నాటక లక్షణాన్ని గూర్చి ప్రతాపరుద్రీయంలో బాణంవలె సంధ్యంగము లుండి కైసికీ వృత్తి శృంగార పరిపూర్ణత ఉద్ఘాత్యకాది వీథ్యంగములు కలిగి యుండుట వీధి లక్షణంగా జెప్పబడింది.