ప్రదర్శించేవారనీ నేలటూరి వెంకట రమణయ్యగారి లాంటి చరిత్రకారులు సూచిస్తున్నారు.
- తంజావూరు రాజులు:
17 వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో యక్షగానానికి కూచిపూడి కలాపంతో సంబంధం కలిగి ఆనాటినుంచీ యక్షగానాలలో వివిధ ప్రక్రియలను ప్రవేశ పెట్టారు.
18 వ శతాబ్దం నాటికి ఆంధ్రదేశపు యక్షగానాల మీద, కొన్నిటి పైన మార్గ నాటకాల ప్రభావం కూడ గోచరించింది.
17 వ శతాబ్దం ఉత్తరార్థంలో అధునిక నాటక రంగ ఛాయలు కూడ యక్షగానాలమీద బడడంతో వీథి నాటకరంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. దీనితో అనాదిగా వస్తున్న యక్షాగాన ప్రదర్శనా ప్రక్రియ అభివృద్ధి సన్నగిల్లుతూ వచ్చింది.
17 వ శతాబ్దంలో తంజావూరులో యక్షగానాలకు రాజాశ్రయం లభించింది.
- రాజులు రచించిన యక్షగానాలు:
రఘునాథనాయకుడు, విజయ రాఘవ నాయకుల కాలంలో నాటక శాలలు వెలిశాయి. ఈ రాజులు స్వయంగా యక్షగానాలనే రచించారు. కాని విజయ రాఘవ నాయకుని ఆస్థానంలో ఎక్కువ ప్రోత్సహింపబడి వీథినాటకం వైఖరిలో అభివృద్ధి చెందింది. ఉదాహరణకు విజయరాఘవుని "పూతనాపహరణం" "ప్రహ్లద చరిత్ర" మొదలైన వాటిలో రంగ ప్రయోగ సూచనలు అనేకం వున్నాయి. ప్రహ్లాద చరిత్రలో