పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకటనాథ కవి పంచతంత్రంలో కడివోని తెఱనాటకపుటూరి జంగాలు అని వ్రాశారు.

వీథి ప్రాముఖ్యం:

ఆనాడు వినోద కార్య క్రమాలన్నీ వీథుల్లోనే జరుపబడేవి. మహాభారతం, రామాయణం, గరుడపురాణం, బసవపౌరాణం మొదలైన పురాణ గాథలు చదవటం, తేటతెలుగులో ప్రేక్షకులకు అర్థమయ్యే శైలిలో అర్థం చెప్పడం ఆచారంగా వుండేది. గ్రామాలలో గ్రామ రెడ్లు, పండితులు, బ్రాహ్మణులు మొదలైన వారు వీటిని నిర్వహించేవారు.

ఆనాడు తగూలు, పంచాయితీలు, అన్నీ వీథుల్లోనే జరిగేవి. ఆనాడు వీథికి అంతటి ప్రాముఖ్యముండేది. వీథుల్లోనే వీథి బడులు పెట్టి చదువు చెప్పే వారు. భాగవతులు మొదలైనవారు ఎవరు వచ్చినా నడివీథిలో కార్యక్రమం జరిగేది. వివాహానంతరం ఊరేగింపులు, మేజువాణీలు, దేవదాసి నృత్యాలు వీథుల్లోనె జరిగేవి జాతర్ల ఉత్సవాలూ, ఊరేగింపుళూ, ఆటపాటలూ అన్నీ వీథుల్లోనే జరిగేవి. వీథికి అంతటి ప్రాముక్యముండేది. వీథుల్లో నాటకాలు ఆడేవారు గనుక వీథి నాటకాలనీ ప్రదర్శించేవారిని వీథిభాగవతులని పిలిచేవారు.

రంగస్థలం:

క్రీ.శ. 16 వ శతాబ్దం నుండి ఆంధ్ర దేశంలో ఎక్కువగా యక్షగానాలు రచించ బడ్డాయి. ఆనాటికే దోర సముద్రపు నటులు, కూచి పూడి భాగవతులు, జంగాలు మొదలైన వారందరూ, వివిధ రకాలుగా వీథి నాటకాలను, తెరనాటకాలను, బయలాటలను ప్రతి వూరిలోనూ ప్రసిద్ధంగా ప్రదర్శించేవారు.

దేశి నాటకాలను విశేషంగా ప్రదర్శించారనీ యక్షగానాల్లో నాటకోచితమైన రచనా విధానాలు ప్రవేశ పెట్టబడ్డాయనీ, అందుకు తార్కాణం సుగ్రీవ విజయమేననీ, సుగ్రీవ విజయం నాటకంలో ఆయా పాత్రల్లో కొందరు పాటలు పాడేవారనీ, తక్కిన సంధి వచనాలు మొదలైనవి ఒకరిద్దరు సూత్రధారులు పఠించడం వల్లనూ సుగ్రీవ విజయం లాంటి యక్షగానం వీథి నాటకంగా