పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీథి నలంకరించిన వీథి నాటకం

ఈ నాటకాలంటే పురాతన కాలంనుంచీ ప్రజా సామాన్యం అభిమానాన్ని చూరగొన్న నాటకాలు ముఖ్యంగా దేశి నాటక సంప్రదాయాలు, చాలవరకు శివకవుల ఆధ్వర్యంలోనే వర్థిల్లాయి. కారణం శైవమతం విజృంభించిన రోజుల్లో శైవమత సంప్రదాయలను ప్రజా సామాన్యానికి విశద పరచడానికి అనేక విధాలయిన ప్రచార సాధనాలను ఉపయోగించారు. శివకవులే అటువంటి రూపకాలను వ్రాయడము వారే వాటిని వ్వాప్తిలోకి తేవడం వల్ల దేసి సంప్రదాయపు కళాఖండాలన్నీ శైవ మతస్థుల సొమ్మని చెప్పవచ్చు.

పంక్తి బాహ్యులు:

ఆర్య సంప్రదాయ ప్రకారం నటులను పంక్తి బాహ్యులుగా నిర్ణయించారు. అటువంటి వారికి సంఘంలో గౌరవ మరాదలు శూన్యం. కాని శైవమతాన్ని అవలంబించిన వారుగాని, వివిధమైన జాతి మత విచక్షణ లేని జంగాలు గాని ఇటువంటి నిర్ణయాలను విధి నిషేధాజ్ఞలు పాటించ లేదు. అంతే కాక శైవమతాన్ని అవలంబించిన అగ్ర వర్ణములైన బ్రాహ్మణాది కులముల వారికి కూడ ఏవిధమైన పట్టింపులు లేకపోవడం వల్ల అగ్ర జాతుల వారందరూ దేశి నాటకాలను ప్రదర్శించారు. శైవ భక్తులైన జంగాలు మొదలైనవారు శివ సంబంధమైన నాటకాలను ప్రదర్శించారు. నాటకాలు ఆడటంలో జంగము వారు ముఖ్యులు. కృష్ణదేవరాయల కాలంలో వున్న బైచరాజు