- ప్రసిద్ధి చెందిన వీథినాటకాలు:
16 వ శతాబ్దంలోని తాయి కొండ నాటక సమాజంలో ఒక స్త్రీ పాత్రను స్త్రీయే ధరించి నట్లు తెలుస్తూ వుంది. తాయి కొండ నాటక సమాజం __యక్షగాన సమాజమని ఊహించటానికి అవకాశం లేదనీ, అది ఒక వీథి నాటకమే అయి వుంటుందనీ యస్వీ. జోగారావుగారు,తమ యక్షగాన వాఙ్మయంలో తెలియచేసారు.
18 వ శతాబ్దంలో కూచిమంచి జగ్గకవి చంద్రశసిరేఖా విలాపం__ అడు భాగవతుని జూడ గడ్డము మూలి నున్నగా గొరిగించుకొన్నావారు అనే దానిని బట్టీ, తురుగా రామకవి ఒక చాటువులో బాగోతుల బుచ్చిగానిని స్త్రీ పాత్రధారిగా పేర్కొనడాన్ని బట్టీ.
- స్త్రీ పాత్రలు, పురుషులే:
నాటి నుండి నేటివరకు కూచిపూడి వారు స్త్రీ పాత్రల్నీ పురుషులే ధరిస్తున్నారు. కూచిపూడి నటుల్ని సంబోధించడంలో "భామా వేషగాడనీ" "రాణి వేషగాడనీ""ఆడవేషగాడనీ" పిలవడాన్ని బట్టి యక్షగానాల అనంతరం ఆయా నాటక సమాజాలు, వీథి నాటక సమాజాలు, వీథి నాటకాలు ప్రదర్శించినట్లు విదితమౌతూంది.
కూచిపూడి మేళాల్లో ప్రసిద్ధమైనది ఆనాడు సిద్ధేంద్ర యోగి మేళం. అంతకు పూర్వం 18 వ శతాబ్దంలో భాగోతులల బుచ్చిగాని మేళం, 19 వ శతాబ్దంలో రాయలసీమ లేపాక్షి మేజులపల్లి, తాడి పత్రి మేళాలు, 19, 20 వ శతాబ్దాల మధ్య, నెల్లూరు మండలంలో, వడకండ్ల రామకృష్ణయ్యాగారి మేళాలు - "విశాఖపట్నం" "నరసింగపల్లీ" "కళ్ళేపల్లి" "కందాళ చిందంబర మేళాలు", "పల్నాటి సీమ మేళాలు" మొదలైనవి ప్రసిద్ధి జెందాయి.
- నాటి వీథి నాటక రంగ స్థలం:
నాటినుంచీ నేటి వరకూ వీథి నాటకాలు వీథుల్లోనే ప్రదర్శింప బడుతున్నాయి. నాలుగు వీథుల కూడలిలో గానీ, వూరి వెలుపల బయలు ప్రదేశంలో