పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ముఖం నిండా సున్నపు బొట్లూ,బొట్టుల మధ్య నల్లచుక్కలు, నల్లటి గుడ్డ, అంట గట్టిన తలకు ఒక పక్కగా కాకి ఈకల కుచ్చు బెట్టి మొలకు గోచి పెట్టి, ఒక చేతిలో వంకర దుడ్డుకఱ్ఱ. మరొక చేతిలో చింకి జోలె వేసుకుని వున్నట్టుండి ఏదో ఒక మూల నుండి గొంతాలమ్మ పండుగ సందర్భంలో పిల్లలందర్నీ హడలగొట్టి ప్రేక్షకులందర్నీ ఒక అదుపులో వుంచేవాడు. ఇదే ఈ నాడు మనకు కనిపించే సోలిగాని వేషం. ఈ సోలిగానిని చోడిగాడని, సోడిగాడనీ, సింగడనీ వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ సోలిగాడి పేరు, ప్రాచీనం నుండీ ప్రస్తుతం వరకూ ఆంధ్రప్రజాజీవితంలో జీవించి వుంది.

తోలుబొమ్మలాటలో జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పాగాడు, కేతిగాడు ఎటువంటి ప్రాముఖ్యం వహిస్తున్నారో, ఈ చోడిగాడు కూడ చోడిగాని కలాపంలో అంతటి ప్రాముఖ్యం వహిస్తున్నాడు. కాని బొమ్మలాటలో పాత్రలు కేవలం హాస్య పాత్రలు మాత్రమే.

చోడిగాని పాత్ర అలా కాక, కథానాయకుడు గానూ, హాస్య పాత్రగానూ జీవిస్తున్నాడు. సోలిగాని పేరు ప్రజా జీవితంలో ఎలా హత్తుకు పోయిందో ఉదాహరణలు చూస్తే మనకు బోధపడుతుండి. పెళ్ళి పందిళ్ళలో ఫలానా వాడు సోలిగాడులా వున్నాడనీ, గాలిగా తిరిగే వాళ్ళను సోడిగాడిలా తిరుగు తున్నాడని, భార్య తోడు లేకుండా వచ్చిన వాడిని సోలిగాడులా వచ్చాడనీ రకరకాలుగా పిలుస్తూ వుంటారు.

కరకు గుండెల్ని కదిలించే కథా వస్తువు:
TeluguVariJanapadaKalarupalu.djvu

కూచిపూడి వారు ప్రదర్శించే భామాకలాపం, గొల్లకలాపం, మాదిరి ఈ చోడిగానిది కూడా ఒక కలాపమే. ఈ చోడిగాని కలాపానికి కథావస్తువు సింగణ్ణి మరిపించి పారిపోయిన సింగిని వెదుక్కుంటూ వియోగాన్ని అభినయిస్తూ తుదకు సింగిని కసులుకుని తనను వదిలి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో మొదలైన ప్రశ్నల ద్వారా వాగ్వివాదం జరిపి చివరికి సింగిని తీసుకుని ఇరువురూ ఒక ఇంటికి చేరడంతో చోడి గాని కలాపం కథ సమాప్తమౌతుంది. తొలి ఘట్టంలో చోడి గాడు తెర వెడలి