పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలాట కళాకారులు

నిమ్మల గోవిందు:

షుమారు అయిదువందల సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి వలసవచ్చి, అనంతపురం జిల్ల, ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచు కున్నారు. ఆ సంతతికి చెందిన దళవాయి గోవిందు, ఈ నాటికీ ఆవృత్తినే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సమాచార శాఖ ద్వార, ఫామిలి ప్లానింగ్ గురించి బొమ్మలాట ద్వార ప్రచారం చేస్తున్నారు. బొమ్మలను తయారుచేయడం, ప్రదర్శించే కథలలోని మాటల్నీ పాటల్నీ పాడుతూ, సూత్ర ధారుడుగా వ్వవహారిస్తున్నారు. వీరు ప్రదర్శిచే ముఖ్య ప్రదర్శనాలు "సుందర కాండ " "మైరావణ", "సతీ సులోచనా", 'ఇంద్రజిత్తు" మొదలైనవి ముఖ్యమైనవి.

కుమారరాజారావు:

అలాగే నెల్లూరు జిల్లా ధర్మారావు చెరువుపల్లి వాస్తవ్యుడు, కుమార రాజారావుగారు బొమ్మలాట ప్రదర్శనలో అవార్డు నందుకున్నారు. భారత దేశంలోనూ, విదేశాలలోనూ పలు ప్రదర్శనలిచ్చి, ప్రఖ్యాతి వహించారు.

అనపర్తి చిన్నకృష్ణ:

తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీప గ్రామం, మాధవపట్నం బొమ్మలాట కళాకారులకు ప్రసిద్ధి. ఈ నాటికీ బొమ్మలాటలనే నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ నాడు శ్రీ సీతారామ నిలయ చర్మ చిత్రకళా ప్రదర్శన కమిటీ అధ్యక్షులుగా దర్శకులుగా అనపర్తి చిన్నకృష్ణగారు వ్వవహరిస్తున్నారు.

తోట పవన్ కుమార్:

సామర్ల కోట మండలం, మాధవపట్నంలో, శ్రీ నటరాజ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీ అధ్యక్షులుగా పవన్ కుమార్ వ్వవహరిస్తున్నారు. భారత