పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బారుల సమక్షంలోనూ ప్రదర్శించి, ఆనాటి తోలుబొమ్మల ఆట విశిష్టతను చాటారు. బొమ్మల ప్రదర్శనంలో పూర్వం ఉపయోగించే ఆముదపు దీపాలను తొలగించి, ట్యూబులైటుల ద్వార ప్రదర్సిస్తున్నారు. తెరకు కూడ ఇనుప గొట్టాల ఫ్రేమును తయారు చేసి, ప్రదర్శనాన్ని అవలీలగా ప్రదర్శించే ఏర్పాటు చేశారు. తోలుబొమ్మలతో పాటు గ్లోవీ బొమ్మలను కూడ (గ్లోవీపపెట్సు) ప్రదర్శిస్తున్నారు.

TeluguVariJanapadaKalarupalu.djvu
ఎం.వి.రమణమూర్తి

ఎక్కువ మంది హంగు దారులు అవసరం లేకుండా కథావృత్తాన్నంతా టేపురికార్డు చేసి బొమ్మలను ఆడించడానికి మాత్రం ఇద్దరు ముగ్గురు మనుషులతో ప్రదర్శనాలు సాగిస్తున్నారు. కథల్లో లంకాదహనం మొదలైన పౌరాణిక గాథలతోపాటు పంచతంత్ర కథలు, కుటుంబ నియంత్రణ మొదలైన ఇతివృత్తాలకు సరిపడే బొమ్మలను తయారు చేసి ప్రదర్శనాల నిచ్చారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

కొంతకాలం వారు మద్రాసు అడయారులో సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ లో, బొమ్మల పరిశోధనలో ఆచార్యులుగా పని చేశారు. బొమ్మలను తయారు చేయటంలో తరిఫీదు ఇచ్చారు. బొమ్మలను తయారు చేయడంలో ఆధునికమైన పరికరాలను వుపయోగించారు. ఎన్నో బొమ్మలను ఇతర రాష్ట్రాలకు, ఇతరదేశాలకు ఎగుమతి చేశారు. వీరికి సహాయంగా సీత, ఇతర కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయ పడ్డారు. రమణ మూర్తిగారు కీర్తిశేషులయ్యారు.