Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డనే సామెత ప్రకారం పైరెండు పాత్రలనూ తలతన్నేవాడు. ఈ అల్లాటప్పగాడు. ప్రదర్శనంలో బంగారక్కను గడసరి పెండ్లాంగా సృష్టిస్తారు. ఈమెకు, పోలిగాడికి నిరంతరం కయ్యం నడుస్తూ వుంటుండి. కాసేపు రెండు పాత్రలూ అతి విచిత్రంగా అసభ్య శృంగారాన్ని అభినయిస్తాయి. కొంచెంసేపు పోట్లాట, మరల రాజీ, ఇంతలో పోలిగాడు అంతర్థానం. ఈ సమయంలో అల్లటప్పగాడు బంగారక్క దగ్గర ప్రత్యక్షమౌతాడు. బంగారక్కకు, అల్లాటప్పకు సంబంధాన్ని కుదురుస్తాడు. రెండు పాత్రలూ మంచి శృంగారపు పట్టులో వుండగా మరో పాత్ర ప్రవేసిస్తుంది. అది కేతిగాని పాత్ర.

కేతిగాడు:

కేతిగాడి పాత్ర అతి విచిత్రమైంది. అన్నీ బొమ్మలకన్నా కేతిగాడి బొమ్మ చిన్నది. ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు పానకంలో పుల్లలాగ ఒక అడుగు చోటు తెరమీద వుంటే చాలు హఠాత్తుగా ప్రవేశిస్తాడు. శృంగార ఘట్టంలో వున్న అల్లాటప్ప గాణ్ణి టకీమని ఒక్క దెబ్బ కొడతాడు కేతిగాడు. వెంటనే అంతర్ధానమౌతాడు అల్లాటప్పా. ఇంకేముంది కేతిగాడు బంగారక్కను ఏడిపిస్తాడు. ఇలాంటి ఘట్టాలు ప్రదర్శనంలో వచ్చే వ్వవధిని కమ్మివేస్తూ వుంటాయి. చాలమంది ప్రేక్షకులు కథకంటే హాస్య పాత్రల ప్రవేశం కొరకే ఎదురు చూస్తూ వుంటారు. అందువల్లనే ప్రదర్శనం తెల్లావార్లూ ప్రదర్శించినా విసుగుజెందరు.

వానలు రాకపోతే, వాటమైన కిటుకు:

గ్రామాల్లో ముఖ్యంగా వ్వవసాయ తరుణం అయిపోయిన తరువాత ఈ బొమ్మలాటల ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో జాన పదులకు కొన్ని నమ్మకాలు కూడ వున్నాయి. ఉత్తర గోగ్రహణం కథ ఆడిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాలు లేని ప్రాంతంలో ఆ ఆటలను ఆడిస్తూ వుంటారు. ఈ నాటికీ కాకినాడ ప్రాంతంలో వర్షాలు కురవనప్పుడల్లా దగ్గరలో వున్న మాధవపట్నం బొమ్మలాట వారిని ఆహ్వానించి శ్రీ ధేనువు కొండ వెంకయ్యగారు రచించిన ఉత్తర గోగ్రహాణాన్నీ, విరాటపర్వాన్నీ ప్రదర్శిస్తారు.