పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహురూపాల బహురూపకం

103


పాత్ర గొనిపించ గొనగను బ్రౌఢి యైన వాడె నటుడన బరునీ వసుధ యందు.

అని వుదహరించడాన్ని బట్టి బహురూప మనేది ఒక దేశీ నృత్య విశేషమనీ, నేర్పు గల నటుని యొక్క ప్రతిభా విశేషమనీ తెలుస్తూంది.

అలాగే పోతనగారి భాగవతంలో

గోప కుమారులం గూడికొని కృష్ణుండు
ఏ సూత్రధారి మీ రందఱు బహురూపు
లని చెలంగుచు నాటలాడ.

అనే పంక్తుల్ని బట్టి బహురూప ప్రయోక్తగా సూత్రధారుడనే వాడు ఒకడుంటాడని తెలుస్తూంది.

అన్నమయ్య ఆధారాలు:

అలాగే పదిహేనవ శతాబ్దానికి చెందిన తాళ్ళపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో బహువారములు, బహురూప ప్రసక్తి వచ్చింది. అన్నమాచార్యు లొకచోట బహురూపుండ వైతి అని అంటాడు.

మరొకచోట, ప్రకటము బహురూపము లయినాడతడు. అకుటిలమహిమల యనంతుడే అని అంటాడు.

ఇంకొకచోట... కొండంత దొరతనము కోరి మీద వేసుకొంటి నండనే యా బహురూప మాడకపోదు. అంటూ, మరికొన్ని సంకీర్తనల్లో బహురూపాన్ని గురించి క్రింది విధంగా ఉదహరించాడని ఉదహరించారు.

పాయమంటా ముదిమంటా బహురూపము యింక
నేయెడాగాచెదు మము నిందిరారమణ ॥పల్లవి॥

అలాగే__

అన్నలంటా, తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
పన్నుకొని తిరిగేరు బహురూపాలు__

అంటూ, బహురూపాలను గురించి సంకీర్తనలలో ఎన్నో చోట్ల ప్రస్తావించారు.