Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

జానపదకళారూపాలు


లలితాంగ రస కళా లంకారరేఖ
లలవడ బహురూప మాడెడు వారు.

అని పేర్కొన బడింది. బహురూప వివరణలో నేపథ్య వైవిద్యంతో పాటు అభినయ వైవిధ్యం కూడా చూపబడింది. పై ఉదాహరణలో చతుర్విధ అభినయాలు బహురూపంలో చోటు చేసుకున్నాయి.

యథావాక్కుల అన్నమయ్య:

పదమూడవ శతాబ్దానికి చెందిన యథావాక్కుల అన్నమయ్య తన "సర్వేశ్వర శతకం" బహురూపాన్ని గూర్చి ఇలా వివరించాడు.

అమరంగన్ స్ఫుట భక్తి నాటకము భాషాంగ క్రియాంగ భిర
మ్యముగా జూపిన మెచ్చి మీరలు పు రే యన్నంతకున్ యోనిగే
హములన్ రూపులు పన్ను కొంచును నటుండై వచ్చి సంసార రం
గము లోనన్ బహురూప మాడు వెలయంగా జీవి సర్వేశ్వరా.

అంటూ నాటకాలలో బహువేషాలున్నట్లు వివరించాడు. అంటే నాటకంలో బహు వేషాలున్నట్లా, లేక ఒకే వ్వక్తి వివిధ పాత్రలను అభినయించటమా అని మనం అలోచించి నప్పుడు బహురూపాల్ని ఒకే వ్వక్తి నటించి, ప్రేక్షకులను మెప్పించటం, నిజంగా నటుని యొక్క ప్రజ్ఞా విశేషంగా భావించ వచ్చును.

ప్రబంధ రత్నావళి వివరణ:

దామరాజు సోమయ్య భరతమున క్రీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రులవారి సంపాదకత్వంలో వెలువడిన ప్రబంధ రత్నావళిలో__

కుండలి బహురూప దండలాస్య విలాస దేశి మార్గంబుల తెరువు లెరిగి
నయము, బిరుసును సరిగతుల్ కడదిగాను
తిరువు మురువును నిలకడ తిన్న నగును