పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహురూపాల బహురూపం

బ్రహ్మణీ, బ్రహ్మ జననీ
బహురూపా బుధార్చితా
ప్రసవిత్రీ ప్రజండా
జ్ఞాప్రతిష్ఠా ప్రికటాకృతి

బహునామాలతో పూజించే జగజ్జననినే బహురూపిగా లాక్షణికులు వర్ణించారు. భరత నాట్య శాస్త్రకారుడైన భరతముని కాలం నుంచీ, దశవిధ రూపకాలు మొదలు అనేక రకాల నాట్య ప్రక్రియలు వెలుగొందినట్లు మనకు అనేక అధారాలున్నాయి. అనేక లక్షల గ్రంథాలలో వివిధ ప్రక్రియలకు సంబందించి వివరణలున్నాయి కాని బహురూపానికి సరైన నిర్వచన మిచ్చినవారు లేరు.

బహురూపమంటే?

బహురూపమంటే అన్నిటికంటే పెద్ద రూపమా లేక కొంతమంది నటులు కొన్ని విభిన్న పాత్రలను పోషించడమా? అలాకాక ఒకే నటుడు విభిన్న పాత్రలను అభినయించటమా? లేక పగటి వేషధారులు రోజుకొక వేషం చొప్పున ప్రదర్శించే వివిధ రకాల పగటి వేషాలా? వీటిలో ఏదో ఒకటై యుండాలి. బహురూపాలను నటించే నటుణ్ణి బహురూపిగా వర్ణించి వుండవచ్చు. వారే పగటి వేషధారులు కావచ్చు. వారే బహురూపులని నా అభిప్రాయం.

బహురూప ప్రసక్తి వున్న మన గ్రంథాలలో బహురూపాన్ని గూర్చి ఎటువంటి వివరాలు లేవు. కాని తెలుగు వాఙ్మయంలో మాత్రం బహురూప ప్రశస్తి ఎక్కువగా కనిపిస్తూ వుంది. అయితే బహురూప కళారూపానికి సంబంధించిన గ్రంథాలు మాత్రం మనకు లభ్యం కావడం లేదు.

సోమనాథుడు:

పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో అనేక ప్రాచీన కళా రూపాల ప్రసక్తితో పాటు బహురూప కళారూపాన్ని గూర్చి పర్వత ప్రకరణంలో శివరాత్రి జాగరణ వినోద కాలక్షేప ప్రస్తావనలో__