పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వరదరాజు పెరుమాళ్ళు వసంతోత్సవాలు:

వీథి భాగవతాలు ఎక్కువగా వైశాఖ మాసంలో జరుగుతాయి. వారం రోజులు జరుగుతాయి. నృసింహ జయంతినాడు ప్రహ్లద నాటకంతో ప్రారంభిస్తారు. ప్రదర్శనాలను తిలకించటానికి వరిసర గ్రామాల ప్రజలు అబాలగోపాలం కదిలి వస్తారు. పాత్రధారులు వారు ధరించే ప్రతిపాత్ర వేషధారణ తోనూ, తంజావూరు రాజస్థాన సాంప్రదాయాల ననుసరించి రాజు పాత్రలకు తంజావూరు రాజదుస్తుల మాదిరినే ధరిస్తారు. బ్రహ్మ, విష్ణు, నృసింహమూర్తి, ఇంద్రుడు, యముడు, మొదలైన పాత్రలకు ముసుగులను ఉపయోగిస్తారు. ప్రదర్శన రోజున, దుష్టపాత్రలను ధరించే నటులు ఆ రోజంతా ఉపవాసం చేస్తారు.

ప్రదర్శన ప్రారంభం:

రాత్రి పది గంటలక్లు ప్రదర్శన ప్రారంబమౌతుంది. వీరికి హంగుగా తిత్తి ముఖవీణ, మృదంగం, తాళపు చిప్పలూ వుంటాయి. వంత పాట పాడేవారు నలుగురుంటారు. ఒకరు పద్యంగానీ ఎత్తుకుంటే మిగిలినవారందరూ అదే శ్లోకాన్ని వంత పాడుతారు. వీరందరూ ప్రారంభ శ్లోకాలను ఆశుధారగా వల్లించిన అనంతరం సభాంగాణానికి ఒక విచిత్రమైన పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్రధారి కొంటెకోణంగి.

కొంటె కోణంగి:

మన భాగవతాల్లోని మాధవి, సైరంద్రి, ధర్మి, విధూషకుడు, అల్లాటప్పా, కేతిగాడు, సుంకర కొండడు, బంగారక్క, రత్నాల పోలిగాడు, మాదిరే ఈ కొంటె కోణంగి పాత్ర ధారి కూడ. కోణంగి పాత్రధారి ప్రవేశానికి ఒక హద్దూపద్దూ ఏమి లేదు. ప్రదర్శనంలొ సమయాను కూలంగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రత్యక్షమై ప్రేక్షకుల్ని ఆనంద పరుస్తాడు. పాత్రల మధ్య కలహాలు పెంచుతాడు. వాటిని చమత్కారంగా పరిష్కారిస్తాడు. ఒకేసారి ప్రేక్షకులలో ప్రేక్షకుడై నటిస్తాడు.

TeluguVariJanapadaKalarupalu.djvu
చోపుదారు:

వెంటనే విఘ్నేశ్వర ప్రార్థన ప్రారంభమౌతుంది. వినాయక పాత్రధారి, నృత్యం చేస్తూ నిష్క్ర