పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మిస్తాడు. ఆ వెంటనే సభారంగానికి వచ్చే రాజుగారి రాకను గూర్చి కటకమువాడు ప్రవేశించి వెల్లడిస్తాడు. సభవారందర్నీ ఉద్దేశించి, రాజుగారు వస్తున్నారు. గనుక ఎక్కడి వారక్కడ గప్ చిప్ అంటూ వెళ్ళిపోతాడు. ఇతనిని కటికము వాడని చోపుదారని పిలవడం వాడుక. ఈ చోపు దారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

చోపుదారు వచ్చేనే
     రాజసభకు
చోపు దారు వచ్చేనే

అంటూ ప్రవేశిస్తాడు. ఈ విధంగా ప్రదర్శనాన్ని ప్రజాభిరుచుల ననుసరించి అందరినీ సంతృప్తి పరుస్తూ కథా విధానం అందరికీ ఆర్థమయ్యే పద్ధతిలో సంగీతం, సాహిత్యం, నృత్యం, శృంగారం, హాస్యం మొదలైన వాటి నన్నింటినీ సమపాళ్లలో నడుపుతాడు.

కొంటె కోణంగిచోపుదార్ల నిష్క్రమణాంనంతరం సంప్రదాయం ప్రకారం నృత్యం చేస్తూ ఫలానావారు ప్రవేశిస్తున్నారు. అంటే రాజు వెడలె అంటూ రాజు పాత్రలూ, స్త్రీపాత్రలైతే దేవిని చిత్రాంగద దేవినే, భామనే సత్యభామనే అంటూ పాత్రల వ్రవేశం జరుగుతుంది. ఆయా పాత్రధారులు తమ నటనా నిపుణత్వాన్ని నాట్య చమత్కారాన్ని చూపిస్తారు.

తెలుగుతనం:

మేలటూరు శూలమంగళం ఊత్తుకూడి గ్రామాల్లో ప్రదర్శించే ప్రదర్శనాలన్నీ తెలుగులో వ్రాయబడినవే. ఈ నాటికి మేలటూరు వరదరాజు పెరుమాళ్ళు వసంతోత్సవంలో ప్రదర్శించే యక్షగానాలన్నీ తెలుగే, రాను రాను చరిత్ర గతి మారి తెలుగు నాటకాలను అనువదించి తెలుగులో ప్రదర్శిస్తున్నారు.

అందమైన యక్షగానాలను అందరూ ఆరాధించారు:

తంజావూరు రాజుల్లో అచ్యుతప్ప నాయకుని మరణానంతరం రాజ్య పారిపాలనకు వచ్చిన రఘునాథరాయలు, విజయరాఘవరాయలు కాలంలో కూడ ఈ భాగవతాలు ఆదరించబడ్డాయి. తరువాత తంజావూరు రాజ్యాన్ని పరిపాలించిన మహారాష్ట్ర ప్రభువుల కాలంలో కూడ ఈ వీథిభాగవతాలు విశేష ప్రశస్తి పొందాయి.