స్వయంగా అనేక రచనలు చేశాడు. వాటిలో ముఖ్యమైనవి యక్షగానాలే. ఈయన కృతులలో ముఖ్యమైనవి:.
ప్రహ్లద చరిత్ర | రాజగోపాల విలాసం |
ఉషాపరిణయం | రఘునాథాభ్యుదయం |
మోహినీ విలాసం | పూతనాపహరణం |
మంజరీ నాటకం | సముద్రమథన నాటకం |
కృష్ణవిలాసం | జానకీ కళ్యాణం |
పుణ్యకతవ్రనాటకం |
ఈయన అనేక మంది కవిగాయక నటులకు ఆశ్రమిచ్చాడు. అనేక అన్నదానాలు చేశాడు. అన్నదానాన్ని కథావస్తువుగా తీసుకుని పురుషోత్తమ దీక్షితుడు విడిగా ఒక అన్నదాన నాటకాన్నే రచించాడు. ఈయన తన తండ్రి రఘునాథరాయల చరిత్రను రఘునాథాభ్యుదయమనే యక్షగానంగా వ్రాసి ప్రచారం చేయించాడు.
- పాతనుంచి కొత్తకు:
ఆనాటి యక్షగానాలు పురాణ కథావృత్తాలతో కూడి వుండేవి. కాని విజయ రాఘవుడు మహావీరుని చరిత్రను యక్షగానంగా రచించాడు.
ఈ విధంగా విజయ రాఘవుని ఆధ్వర్యంలో యక్షగానాలు అజరామరంగా వెలుగొందాయి.
నాయక రాజుల కళాకాంతులను విరజిమ్మే తంజావూరు సరస్వతి మహల్ లో దాదాపు 30 యక్షగాన నాటకాలున్నాయి. వీటిలో ఎన్ని రఘునాథరాయల కాలంలో వ్రాయబడ్డాయో తెలియదు. ఈ 30 నాటకాలలోనూ ఒక్క శాహిరాజు పేరనే 18 నాటకాలు ఉన్నాయి.
తంజావూరును1684 నుంచి 1710వరకు పరిపాలించిన శాహిరాజే ఈయన అనే ప్రతీతి ఉంది. చాలా భాగం క్షత్రియులు వ్రాసినట్లుగా వుంది.
ప్రథమంలో వ్రాసిన అనేక యక్షగానాల్లో చాల యక్షగానాలు తేలిక భాషలోనూ, ప్రజలందరికీ అర్థమయ్యే గ్రామ్య భాషలోను వ్రాయబడ్డాయి.