పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాయకరాజుల కాలంలో 54 మంది కవి పండితులు సస్కృతాంధ్ర భాషల వ్వాప్తికి తోడ్పడ్డారు.

నాయక రాజులు ఎంతోమంది కళాకారులకు మడులు, మాన్యాలు, అగ్రహారాలు ఇచ్చి సన్మానించారు. దేవాలయాలకూ, మఠాలకు, సత్రాలకూ, దేవదాసీలకూ మాన్యాలిచ్చారు.

యక్షగాన నాజ్మయానికి అక్షయమైన భిక్ష:

ఈయన హయాములో యక్షగాన వాఙ్మయం బహుముఖాల విజృంభించింది. ఈయంజ రాజ దర్బారులో ఒక నాట్య మందిరాన్ని భవ్యంగా నిర్మించి, ఆ రంగస్థలంపై ప్రత్యక్ష్యంగా యక్షగాన ప్రదర్శనాలను ప్రదర్శింప జేశాడు. అనేక ప్రయోగాలను చేయించాడు. రఘునాధాభ్యుదయం అనే విజయరాఘవనాయకుని నాటకంలో రాజ ప్రాసాదంలోని మనోహర చిత్ర దృశ్యాలూ, అనేక చారిత్రిక ఘట్టాలు వర్ణించబడ్డాయి.

ఆంధ్ర తమిళ భాషలను రెంటినీ, కన్నబిడ్డల వలె సమంగా ఆదరించి పోషించారు. ఈ విధంగా దక్షిణ దేశంలో ఆంధ్ర నాయకరాజులు ఒక ఉజ్వలోజ్యల చరిత్రను స్థాపించారు.

తెలుగు కన్నడాలను తలదన్నిన పేరు పెంపులు:

యక్షగానాలు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలోను ఎక్కువ ఖ్యాతిలో వున్నప్పటికీ ఎక్కువ ప్రతిభావికాసంతో విరాజిల్లినవి తంజావూరు యక్షగానాలు మాత్రమే. రఘునాథరాయల కాలంలో యక్షగానాలు అట్టే అంతగా రాణించక పోయినా, విజయరాఘవరాయల కాలంలో చాల ఔన్నత్యాన్ని సంపాదించాయి.

TeluguVariJanapadaKalarupalu.djvu

రఘునాథరాయల కుమారుడైన విజయ రాఘవుడు తండ్రి వలెనే కవులను, గాయకులను, నృత్య శాస్త్రకారులను అపారంగా పోషించాడు. ఈయన స్వయంకవి, నాట్యశాస్త్ర వేత్త;