పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
బహిరంగ ప్రదర్శనశాల:

దీనిని 'తిరంవెళి ఆరంగం' ఆని పిలుస్తారు. ఇది నాయకరాజుల ప్రాసాదంలో సరస్వతీ గ్రంధాలయానికి పడమటి దిక్కుగా, దానిని ఆనుకుని వుంది. దీని పూర్వరూపం ఎటువంటిదో తెలియదు. పైన కప్పులేదు. నాలుగు దిక్కుల్లోనూ తక్కిన ప్రాసాదానికి సంబంధించిన ఎత్తైన గోడలున్నాయి. చతురాకారంగా వున్న ఈ ప్రదేశంలో నేల మీద 2000 మంది వరకూ కూర్చునే అవకాశముంది. ఈశాన్య దిశలో ఎత్తైన దిమ్మ ఒకటుండేదట. దీని మీద నిలబడి మాట్లాడినట్లయితే శబ్ద, గ్రహణ యంత్రాల సహాయం లేకుండానే రెండువేల మందికీ స్పష్టంగా వినిపించేదట.

1952 లో పళనియప్పన్ అనే జిల్లా కలెక్టరు దీనిని పునరుద్ధరించి, రమణీయమైన రంగస్థలాన్ని నిర్మింపజేశాడు. ఈనాడది బహిరంగ నాటక మండపంలాగ ఉంది. ఒక మూలగా వున్న ఈ రంగస్థలం మీద నిలబడి చూచి నట్లయితే ప్రేక్షక స్థానం వర్తులాకారంగా ఉన్నట్లు కనబడుతుందని నాట్యశాస్త్రంలో పి. యస్. ఆర్. అప్పాగారు తెలియజేశారు.

నాయకరాజుల వరవడినే వెళ్ళిన మహారాష్ట్ర రాజులు:

తంజావూరు ఆంధ్రనాయకారాజుల అనంతరం పరిపాలించిన మహారాష్ట్ర రాజులు కూడ తెలుగులో కవులై, కవి పండిత గాయకుల్ని పోషించారు. (క్రీ.శ. 1798 - 1832) శరభోజీ ఆస్థాన గాయక, నర్తకులైన చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం అనే నలుగురూ సుబ్బరాయ నట్టువవారు పుత్రులు.

వీరు నృత్యాన్ని ఏక పాత్రాభినయంగా రూపొందించారు.

తెలుగుతేజు దీపించే తంజావూరు నాట్యం:

తంజావూరు రాజాస్థానంలో నృత్యం ఏకపాత్రాభినయ కళారూపంగా అభివృద్ధి చెందింది.

అదే నేటి తంజావూరు భరత నాట్యంగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రదర్శనకాలం మూడు గంటలు. ఆ మూడు గంటలూ ఒకే ఒక నర్తకి నృత్యం చేస్తుంది. ప్రక్కనున్న