పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లలిత కళాక్షేత్రం తంజావూరు

1565 తళ్ళికోట యుద్ధానంతరం విజయనగర రాజ్యం చిన్నాభిన్నమై పోయింది. రాయల సంతతి వారు కొంతమంది పెనుగొండకూ, మరికొంత మంది చంద్రగిరికీ వెళ్ళారు. మిగిలినవారు తంజావూరుకూ, మధురకూ చేరుకున్నారు. ఈ రెండూ కూడ విజయనగర రాజుల క్రింద సామంత రాజ్యాలుగా వుండేవి. వీటిని పరిపాలించిన నాయక రాజులు చివరి వరకూ ఆంధ్రభాషను పోషిస్తూనే వచ్చారు.

తంజావూరు రాజ్యాన్ని 1535 నుండి 1673 వరకు సుమారు 140 సంవత్సరాలు నాయక రాజులు పరిపాలించారు. ఈ వంశంవారు ఆఖరు వరకూ విజయనగర రాజుల పట్ల విశ్వాస పాత్రులుగా వుంటూ వచ్చారు.

అచ్యుతరాయలు, రఘునాథరాయలు, విజయరాఘవరాయలు వరుసగా పరిపాలించారు. విజయరాఘవ నాయుకునికి మరొ పేరు మన్నారుదాసు, మధురనాయకుడైన చొక్కనాథునికీ, ఇతనికీ జరిగిన యుద్ధంలో (1674) విజయ రాఘవుడు మరణించాడు. అనంతరం రెండు సంవత్సరాల తరువాతి శివాజీ తమ్ముడైన ఎక్కొజీ తంజావూరును ఆక్రమించాడు. ఒక శతాబ్దంపాటు మహారాష్ట్రులు దాన్ని పరిపాలించారు. ఎవరు పరిపాలించినా ఆ నాటికీ ఈ నాటికీ వారి సంస్కృతి అంతా అచ్చం అలా నిలిచే వుంది.

సువర్ణయుగంగా శోభిల్లిన నాయకరాజ్య రంగు హంగులు:

దక్షిణదేశ చరిత్రలో ఆంధ్రనాయకరాజుల పరిపాలన ఒక సువర్ణయుగమని చెప్పవచ్చు. విజయనగర చక్రవర్తుల కాలంలో లలిత కళలు అభివృద్ధి పొందినట్లే, తంజావూరు నాయకరాజుల కాలంలో కూడ లలిత కళలన్నీ వికాసం పొందాయి. తెలుగు సాహిత్యం, సంగీతం, నాట్యం, శిల్పం, యక్షగాన వాఙ్మయం ఒక మహో