పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వారు. ఇందువల్ల కురవంజి రూపాన్ని యక్షగానంగా పిలిచేవారు. వీటిని ఆనాడు వేశ్యలు కూడ ప్రదర్శించేవారు. కళావంతుల్లో ఒక తెగను జక్కుల జాతివారు అని పిలుస్తూ వుండేవారు.

నాటి దాసరులు:

విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ పేరుతో కొందరు శంఖుచక్రాలు కలిగి, ఇత్తడితో చేయబడిన కుండలాలు ధరించి, జింక కొమ్ములు, అలుగులు, మొగిలి యాకుల గొడుగు, గుఱ్ఱపు వెంట్రుకలతో తయారు చేయబడిన విసనకఱ్ఱ , తోలతిత్తి, చిట్టి తాళాలు, చంకన బుట్ట, మెడలో తులసి వేర్లు, మొహాన తెల్లని పంగనామాలు మొదలైన వేషధారణ కలవారై, బాండాలిక అనే కిన్నెరను వాయిస్తూ పదాలను పాడుతూ, మాలమాదిగ గురువులు గానూ పౌరోహితులుగాను వుంటూ యాచిస్తూ వుండేవారని ఆముక్త మాల్యద లో వివరించ బడింది.

ఎందరికో ఎరుక చెప్పిన ఎరుకలసాని:

ఎరుకలసాని పూర్యకాలంలో ఎరుక చెప్పడంద్వారా సంఘంలో మంచి పలుకుబడిని, ప్రాబల్యాన్నీ కలిగివుండేది. రాజాధిరాజులూ, రాణులూ, పండితులూ మెదలైన వారంతా ఎరుకలసాని సోదెకు చెవులు తెగ కోసుకొని, ఆమెను ఆహ్వానించి, ఎరుక చెప్పించుకుని అనేక పారితోషికాలను ఇచ్చేవారు. ఎరుకలసాని ఏ సంస్థానంలో ప్రవేశించాలన్నా - ఏ అభ్యంతరమూ లేక దర్శనానికి అనుమతి ఇచ్చేవారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఈ ఎరుకలసాని సమాజంలో ఎంత పలుకుబడిని సంపాదించిందో, అంతటి స్థానాన్ని ఆనాటి సాహిత్యంలోనూ, కళారూపాల్లో కూడ పొంది, ప్రత్యేకం ఒక పాత్రగానూ వర్థిల్లింది. ఆనాటి ప్రతి కురవంజిలోనూ, యక్షగానాల్లోను ఎరుకసాని ఒక పాత్రగా ప్రవేశించి నాయికికో, నాయకులకో ఎరుక చెప్పి నిష్క్రమించేది.

విజయనగర సామ్రాజ్య కాలంలో ఎరుకత ముఖ్య పాత్ర వహించింది. ఎరుకల యెక్క వేషధారణను గురించి ఆముక్త మాల్యదలో వివరించ బడది. ఎరుకత