పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుని, ఆసందర్భంలో కవులకు, కళాకారులకు 1116 దీనార్లు ఇచ్చేవారట. ఇందుకు ఉదాహరణగా:__

ఆపుడాచోళ వసుంధరాధిపతి నానానర్ఘ్య భూషంబరా
ది పదార్థ ప్రకరంబు త్యాగమహిగా దీనారము ల్వేయునూ
ట పదహార్లుం గృపజేసి.

అని వైజయంతిలో వివరించారు.

వినోదాన్ని వెలిగించిన విప్రవినోదులు:

ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడో చెదురు మదురుగా తప్ప, ఈ విప్రవినోదం ప్రచారంలో వుందని చెప్పలేం. కాని, 1600-1700 సంవత్సరాలలో ఈ వినోదాలు బహుళ వ్వాప్తిలో వున్నాయి. అంటే అది విజయనగర సామ్రాజ్య కాలం. విప్రులనగా బ్రాహ్మణులు. వారు వినోదం చేయడం వలన విప్ర వినోదమని పేరు వచ్చింది. బ్రాహ్మణులలో ఒక జాతి బ్రాహ్మణులు, దేవతోపాసన వలనో, మంత్ర తంత్రాల వలనో చిత్ర విచిత్రమైన గారడీలు చేస్తూ వుంటారు. గుంటుపల్లి ముత్తరాజనే విప్ర వినోది గోలకొండ సుల్తానుల తుది కాలంలో వున్నట్లు, ఆయనను గురించి ఒక చాటువు వున్నట్లు ప్రతాపరెడ్డి గారు తమ సాంఘిక చరిత్రలో తెలియజేశారు.

సంతతమారగించు నెడ సజ్జనకోటుల పూజ సేయు శ్రీ
మంతుడు గుంటుపల్లి కులమంత్రి శిఖామణి ముత్తమంత్రి దౌ
బంతియె బంతిగాక, కడు పంద గులాముల బంతులెల్ల మాల్
బంతులు, దుక్కిటెడ్లయెడ బంతులు, విప్రవినోదిగారడీ
బంతులు దొంగవాండ్ర ములుబంతులు సుమ్ము ధరాతలంబునన్

ప్రజల పాలిటి పండగైన జాతీయ జాతర్లు:

ఆ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా వుండి జాతర్లు జరుగుతూ వుండేవి. ఇవి ఎంతో ఆడంబరంగాను జరిగేవి. వీటిని ప్రజలు ఎంతో పర్వంగా ఎంచేవారు. ఈ సమయంలో యక్షగంధర్వ వేషాలు ధరించి, నృత్యంచేస్తూ వుండే