పుట:TeluguSasanalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

తెలుగు శాసనాలు


అచట యితర పనివాండ్రను సాక్షులుగను సంరక్షకులుగను పెట్టునట్లే యిక్కడ కూడ తనవృత్తికి సంబంధించిన వారినే సాక్షులుగ పెట్టుకొనెను.


ఈ కాడ్ల(డ=θ)వ్ర్యేంగులు రేనాటి చోళుల సుంకాధికారులని తెలియనగును.


'వాకిలి'కి బహువచనము 'వాకిద్లు(అరకటవేములశాసనము)


అట్లే 'కాలు'కి బహువచనము 'కాద్లు'కావచ్చును.


θ అను అక్షరము వాడుకనుండి "పోవునపుడు' 'వాకిఁడ్లు-వాకిళ్ళు' గా మారినట్లు 'కాణ్డు-కార్లు 'అను రూపములనొందియుండ వచ్చును. ఇట్టి వికల్ప రూప ములుండుట కట్టి 'θ'అక్షరమును తొలగించుటయే కార ణము.దాని ఉచ్చారణముతో సన్నిహితోచ్చారణము గల రెండు మూడు రూపము లు వికల్పముగ చెప్పు కొనవలసివచ్చెను. 'కాలు'పదము పశువనెడు అర్థము లో ఇంకను కొన్ని ప్రాంత ములలో వాడుకయందున్నది.కనుక దీనిని నిఘం టు వులో చేర్చుట మంచిది. ఈ విధముగ వాడుకలో నుండియు నిఘంటువుల దృష్టికి రాని పదములను సేకరించుట నేటి పరిశోధకుల బాధ్యత.దానితో పాటు ప్రాంతీయముగ రూఢమైయున్న విశేషార్థ ములు గల పదములను,నుడికారము లను సేకరించ వలసిన అవసరము కూడ కలదు. ప్రాంతీయ పలుకుబడులను అనగా వాక్యోచ్చా రణలోగల భేదములను నవీన పద్ధతిలో తేపురికార్డుచేయుట కూడ భాషాపరిశోధన కు అవసరము.ఇట్టినవీన సాధనములు లేకున్నను శిలల పై వ్రాసియుంచిరి గనుక వాటిలో కొన్నియైనను మనకు లభించుటచే అప్పటి భాష ను కొంతయైనను తెలిసికొనగలుగుచుంటిమి.తెలుగు పదము లనేకము సంస్కృత పదములతో భాషనుండి తొలగింపబడినవి.'తొఱ్ఱు'అను పదము పశువను అర్థములో నిఘంటువులోను,శాసనములందునుకనవచ్చును. తొఱ్ఱూరు అనుగ్రామములు కూడ కలవు.అంటే పూర్వము పశువుల సంతలు జరుగు ప్రదేశములని అర్థము.కాని నేడు అదివాడుకలోలేదు.దానిస్థానములో పశువులు లేక గొడ్లు అనే వాడుచున్నాము.నేడు ఆంగ్లమునుండి,హిందీనుండి, ఉర్దూనుండి అనేక పదములు తెలుగుపదముల స్థానములో వచ్చి చేరుచున్నవి. ఈ దశలు జీవభాషకు తప్పవని భాషా శాస్త్రజ్ఞలు చెప్పుదురు.


అట్లే మఱి కొన్ని పదములు కన్నడపదములని చెప్పి తెలుగునుండి