పుట:TeluguSasanalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేల్పుచెర్ల శాసనము

37


'వ్ర్యేంగు' 'కాలు'అనే పదాలన్నీ స్వల్పభేదములతో సుంకరులను తెలుపునని తోస్తుం ది.ఆహనమల్ల,తైలోక్యమల్ల,త్రిభువనమల్ల అనే బిరుదులు ఈ షద్భేదముతో నొకే యర్థమును చెప్పుట లేదా.అట్లే


కాండ్ల(డ=θ)వ్ర్యేంగు'అనే పద్ద అధికారి కొడుకు అయితణ్ణ అనే అరిపాల వ్ర్యేంగు అనిచెప్పుకొన్నా తప్పులేదు.ఇప్పుడు 'కాలు' పదము యొక్క షష్ఠి కాళ్ల (ళ=θ) అనికావలెను. కాళ్ళు,కాణ్డ్లు, కాద్లు అని ప్రథమా బహువచన రూప ములగునేమో కాద్లు యొక్క షష్ఠి 'కాద్లి 'అగును. అనగాకాలుర యొక్క అనిచెప్ప వలెను.ఊఱు(ఊరు)కి షష్ఠి 'ఊθలఅని' 'వంగనూడ్ల (ద=θ) అను పదములో పై జెప్పిన అరకట వేములశాసనమందు కలదు.


'కాలు' అనుదానిని గూర్చి లోగడ అనేకులు చర్చించిరి. 'గురుపాదాః ' 'పితృపాదాః భగవత్పాదాః'ఇత్యాది సంస్కృ త పదములందు గౌరవార్థముగా వాడబడు 'పాద'శబ్దము న కు తెలుగులో 'కాలు'అనిచెప్పుకొని అదే గౌరవార్థము వాడ బడి యుండునని కొందరు తలంచిరి.కాని యీ శాసనంలో చేంగాలు, మేషికాలు,ఏడ్లకాలు,ఎమ్మళకాలు అనునవి ఆ గౌరవార్థమును సూచించుట లేదు. మనుష్య వాచకములు గాక'చేను'మున్నగువాటికి కూడ 'కాలు'వాడబడు చున్నది.