పుట:TeluguSasanalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము

27

తర్వాత ఈ ధర్మమును కాపాడు వానికి పుణ్యఫలము,చెఱచువానికి పాప ఫలము చెప్పబడినవి.ఇందలి పదములు కొన్ని పరిశీలింపదగియున్నవి.

'విక్రమాదిత్య శక్తి కొమర విక్రమాధితుల కొడు'కను చోట మూడు పురుషాం తరముల వారొకే సమాసములో జేర్చి చెప్పబడుట యొక విశేషము. 'ఏళచున్డి(ఇచట డ వత్తును θ గా చదవాలి) అని 'ఏలుచుణ్డి ' అను నర్థమున వాడబడెను.కాశ్యపగోత్ర రేవశర్మకు అనుతకు బదులు 'రేవ శర్మకాశ్యపగోత్రునికి'అనే ప్రయోగం విలక్షణంగా వున్నది.షష్ఠి ప్రత్యయము 'రేవశర్మ'పదానికి కాకుండగ గోత్రపదానికి చేర్చబడింది.21వ పంక్తి నుండి వేదుద్లు,మువెసెఱువులు,వేవాన్డు,ద్లునిల్పిన పుణ్యము అనుదానిలో ము యొక్క ప్రయోజనము తెలియదు. ప్రథమా విభక్తి ప్రత్యయము కాదు.ఆనాటి కింకా'ంబు 'అనేదే వాడబడుచుండెను.లేఖక ప్రమాదము కావచ్చు ను.'వేగుద్లువు' అని దానిని ప్రకటించిన వరు చదివిరి.అప్పుడు కూడ 'వు'కి ప్రయోజనము కానరదు.ఇచట 'గుడికి' బహువచనము 'గుద్లు' అనియున్నది.అదినేడు గుడ్లు,గుళ్లు అని ద్వివిధ రూపములైనది. అట్లే మఱికొన్ని పదములు గలవు.θ వర్ణము భాషనుండి పోవునప్పుడు దానికి సరిపోవు ఉచ్చారణమును ఉన్న అక్షరములతో సరిపెట్టుటకై చేసిన ప్రయత్నమే యిట్టి వికల్పరూపములయ్యెనని స్పష్టమగుచున్నది.

గుడి& rarr;గుద్లు(=గుడ్లు,గుళ్ళు)(ప్రస్తుత మాలెపాడు శాసనము)

వాకిలి→వకిద్లు(=వాకిండ్లు(=వాకిండ్లు,వాకుళ్ళు)అరకట వేముల శాసనము)

ఊరు→ఊడ్లు(=ఊఁడ్లు,ఊళ్ళు)(ఇదేశాసనము)

కంచరి→కంచద్లు(కంచడ్లు,కంచర్లు)అరకట వేములశాసనము)

వేవాన్డు(ఇచట డ= θ గా చదవాలి)ద్లు అని యీ శాసనమందు చూడనగును.

'వేవాన్డుద్లు(ఇచట డవత్తును θగా చదవాలి) అనుపదము 'వేయి ఊళ్ళు'అను నర్థమున వాడబడినట్లు తోచును.'పుదలి ఏదువాన్డు(θ),'సాక్షి వచ్చువాన్డు (θ)'వక్రంబు వచ్చువాన్డు(డ్=θ) మున్నగు క్రియాయుక్త విశేషము లందు వలె 'వేయి'అనుసంఖ్యావాచకము తరువాత కూడ వాన్డు(డ్=θ) వాడబడెను. వేవాన్డు(డ్=θ) వేయువాడు అని కీ.శే.మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు చెప్పిన యర్థమిచ్చట బాగులేదనిపించును.పుత్రవధ