పుట:TeluguSasanalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

తెలుగు శాసనాలు

స్త్రీవధ,గోవధ అనుటకు పుత్రవద్యంస్త్రీవద్య,గోవద్య అనియున్నది. పుత్రవధయు, స్త్రీవధయు, గోవధయు అని సముచ్చయార్థక 'ఉ 'ను చేర్చదలచనేమో.

'లోకం జన్వాన్డు(ఇచట డ వత్తును θగా చదవాలి)=లోకము చనువాడు

'ఊరు'పదమును గురించి కీ.శే.మల్లంపల్లి సోమశేఖరశర్మగారు కొంత చర్చించిరి(రాజరాజ నరేంద్ర సంచిక).అందువారు 'ఊరు'యొక్క ప్రథమైక వచనము 'వాన్డు(ఇచట డవత్తునుθగా చదవాలి)లో వలె ' ఊను 'కాదగుననియు.అది క్రమముగ ఊణ్డు,ఊడు అయినందువలన ఊడ్లు ప్రథమా బహువచనరూప మేర్పడియుండుననిరి.కాని ప్రాచీన శాసనములగు కొపినేపల్లి శాసనమందొ క దానిలో 'ఊరుపెన్ కాలు ' అనియు,చిలమకూరు శాసనమందు 'చిఱుంబురు పళన్ 'అనే ప్రయోగము ఉన్నది.కనుక 'ఊరు 'యేకవచనరూపము.అట్లాగే వారు చెప్పిన రీతిగ నల్లచెఱువు పల్లె శాసనములో' కజ్గళూన్డు(డ్=θ)ఏళ'అనే ప్రయోహములో 'ఊన్డు(డ్=θ) అనురూపము కనుపించుచున్నది.కనుక ప్రథమైక వచనరూపములోనే సందేహము కలుగు చున్నది..'θ'అను అక్షరముతో కూడిన పదమని చెప్ప వీలగుచున్నది.అది 'ఊన్డు (డ్=θ)అనుటకంటె 'ఊదు 'అనుట యుక్తమని తోచును.అది క్రమముగ 'ఊరు'గ మారియుండును.సాధురేపమే ప్రాచీనకాలమునుండియందు తఱచు కానవచ్చును.కాని వేల్పుచెర్ల శాసనములో 'కొదవునూఱ 'అనిశకటరేఫ కలదు.కనుక అప్పటికే దీనిలోని θ వర్ణము ర,ఱ,లుగ మార్పు నొందుచుండెనని తెలియుచున్నది. బహువచనములో మాత్రము 'ఊద్లు'అను రూపము క్రమముగ ఊడ్లు,ఊళ్ళు అనిమార్పునొంది వికల్పరూపము లేర్పడియుండును. ఏకవచన ములో వారు చెప్పిన ఊణు,ఊడు అనురూపములు చిన్త్యము.'వంగనూర్లి'అని వంగనూరికి సంబం ధించిన లేక వంగనూరులో అను ప్రయోగము అరకట వేముల శాసనమందు కలదు.8,9 శతాబ్ద ము లలో తెలుగుభాషనుండి తొలగిపోయిన 'θ'అను మనకు తెలియని అక్షరము యొక్క వికారము లీ రూపములన్నియు.'ఱ'అను నక్షరముకంటె ఈ 'θ'యొక్క వాడుక ప్రాచీనశాసనములందధికము.ప్రథమైక ప్రత్యయమునందేకాక,బహువచన ప్రత్యమమందు, ప్రాతిపదికలయందు ఇది ఉన్నట్లు తెలియుచున్నది.ఈ క్రిందివి కొన్ని యుదాహరణలు మాత్రమే.

పుణ్యకుమారున్డు(డ్=θ)-ప్ర.ఏ.ప్ర