ఈ పుట అచ్చుదిద్దబడ్డది
64
తెలుఁగు జాతీయములు
వ......వాహినులు చిక్కువడి చిందఱవందరై, మతి
మడియై, యేపు దెగి యవురు సవురై, యన
యదవదమై, యంతంత విచ్చి యరవరలై ....
ఉ. హ. 1
అసిమిలోని దొకటి, అమ్మెడి దొకటి
సంచిలోని దొకటి, అమ్మున దొకటి.
లో నొకటి, వెలి నొకటి అనుట.
ద్వి. అమ్మెడి దొకటియు నసిమిలో దొకటి
ఆడుమాటలు పరమార్థసార్థములు
కూడదు నడువడి కొంతైన నిందు
ప్రభులిం. 14. పే.
అ. అసిమిలోని దొకటి యమ్మెడి దొక్కటి
నీచరిత్ర మెల్ల నేఁడు తెలియ
వచ్చె మాకుఁ గపటవ ర్తనుఁడవు నీవు
చేరి నిన్ను విశ్వసింపఁ దగునె?
హరి. 2.
అసురుసురు
సార ముడిగి తూలు; శ్రమమందలి ధ్వన్యనుకరణ
సీ. ఆయాసపడితిరి యాదిత్య వరులార
యసురుసు రయితిరి వసువులార
లక్ష్మీవి. 2.