ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
63
తే. అట్లు పోద్రొబ్బుటయు నతఁ డాత్మ నిచ్చ
గించుకొని యుండెఁ గాని తా నెంచఁడయ్యె
రంభ యౌఁగాము లా ప్రతిరంభమీఁది
ప్రేమఁ గాముకుల్ నూతనప్రియులు గారె?
కళాపూ. 3. 237
అవురు సవురు
నిస్సత్వము, నిస్సారము
సీ. అనుపు దప్పిరి నొచ్చి రలసి రాపద నొంది
రదవద లైరి చీకాకుపడిరి
యంగలార్చిరి వచ్చి రారడిఁ బొందిరి
బ్రమసిరి పాఱిరి పల్లటిలిరి
బెగ్గడిల్లిరి వికావిక లైరి సొలసిరి
కులకులఁ గూసిరి కుతిలపడిరి
గగ్గులకాడైరి కలంగి రోటాఱిరి
వెలవెల్లనైరి నివ్వెఱఁగుపడిరి
అవురుసవు రైరి గుజగుజయైరి డస్సి
రోల్ల బోయిరి వెగ్గిరి తల్లడిలిరి
సిగ్గువడి రొచ్చవడిరి యిస్సియిసియైరి
తారకునిచేత మునులు బృందారకులును.
హరవి. 3. 10