Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

తెలుఁగు జాతీయములు

“అల్లొ రక్షణా” యనియుఁ బ్రయోగములు గలవు.
"ఓ అల్లా! రక్షించవయ్యా" అని దాని యర్థము.
దిక్కు లేక దేవుఁడా యని పలవించుట.
శా. అల్లో నే రెడుపండో యీయది మద ర్హంబౌ ఫలం బంచుఁ
దా నుల్లంఘించెను బావమాని దివి రాహుం బట్టి మ్రిం
గంగ వై యల్లో రక్షణ యంచుఁ బాఱె నతఁ డయ్యాఖం
డలుఁ జూచుచున్ బెల్లె భీభర మేఁచ నింద్ర' మహి
భృద్భేదీ! యటంచున్ వెసన్.
రామకథా ఉత్త. కాం. పూ. భా. 8. 48
అల్లముతాడే బెల్ల మయినది
అల్లము బెల్లముగా మాఱునా? మాఱదు. కాని అదే
కాలవశమున బెల్లముగా నయినది.
దిక్కు లేనపుడు అలుపపు వస్తువే ఉత్కృష్టవస్తువుగ
నుపయోగించుట అని భావము.
గతి లేనమ్మకు గంజే పానకము అన్న సామెతరకమున.
అల్లపొ ర్లెఱుఁగని
రట్టు లేని.
ఎట్టి కళంకము నెఱుఁగని.
సీ. అల్లపొ ల్లెఱుఁగని నాకులం బను మంచి
        మడుఁగుఁజీరకుఁ జాల మైల సోఁకే
ఉ. హ. 5. 92