Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

57

క. ఆవిప్రవతంసుఁడు ని
త్యావహితుఁడు సమరము లన నఱ్ఱులు సాంచున్
భావం బుల్లాసమయం
బావిధమునవాఁడు నిలుచునా యట్టియెడన్
రామకథా. ఉత్త. కాం.
మ. సొరిదిం గోమలకోకిలారుతము నైష్ఠుర్యమ్ము, రాకావిధు
స్ఫురదంగారత, దక్షిణానిలుఘృణాపూర్ణత్వ, మాతన్వినిం
బొరిగో నఱ్ఱులు సాచుచున్నయవి రేపున్ మాపుఁ బత్రాది
ముర్ముర జాతమ్ము త్వదాగమభ్రమము నీరోధించుఁ
దద్యత్నముల్.
పుష్పబాణవి. పే. 13.
అలిగి తన్నినఁ బఱపుపయిఁ బడినట్లు
తనపై నలిగి పెరవాఁ డోకరుఁడు కాలఁ దన్నం గ్రిందఁ
బడక పోయి మెత్తని దూదిపఱపుపైఁ బడినట్లు.
తొల్దొల్త అనిష్టమే అయినను అది మేలుగా నూఱుట.
క. వెఱవకు కలలోఁ జేసిన
కొఱగామికి వగచుచోట గుణరత్నము చే
కుఱె నీకు నలిగి తన్నినం
బఱపుపయిం బడినయట్లు పద్మదళాక్షీ!
ఉ. హ. 5. 153
ఆలో లక్ష్మణా
ఏడ్పునం దూఁతగఁ గొపఁబడు పదము.
అలో లక్ష్మణా యనియేడ్చుచు.