ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56
తెలుఁగు జాతీయములు
యఱ చేతఁ బండ్లు వచ్చినఁ
గఱతువు గా కిక్షుకార్ముక ప్రతిపక్షా!
నిరం. 3. 32
అఱచేతి మాణిక్యము
అఱ చేతి యుసిరికాయవలెనే అఱచేతి మాణిక్యము
సయితము సుస్పష్టముగ నుండును.
సుస్పష్టమైన దనుట.
సీ. శీతాంశుధరుఁ డఱచేతి మాణిక్యంబు
కద్రూజకటకుండు గాదెకొలుచు
శృం. శా. 4. పే. 82
అఱవ చాకిరి
అఱవలు చేయు చాకిరికి అంతు పంతు చాలు మూల
యుండదఁట.
అంతు పంతు లేని యీ అఱవచాకిరి కే జనించితిం
గాఁబోలు.
ఆణవ యేడుపు
ఆఱవలు డబ్బు కాసించి తమ కేలాటి సంబంధము లేని
పీనుంగులం గుఱించి తెచ్చికోలు దుఃఖమున నేడ్తురఁట.
సంబంధము లేనిచోట సంబంధము తెచ్చిపెట్టుకొని వ్యవహ
రించుట.
ఆఱ్ఱులు సాఁచు
మెడ చాచి యాసించుచుండు
ఎప్పు డెప్పుడా అని కాచుకొనియుండు