Jump to content

పుట:TeluguJaateeyamuluPartI.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగు జాతీయములు

59

అల్లాడి ఆకులు మేయు
దిక్కు- మ్రొక్కు లేక నలు గెలఁకులఁ బలవించుచుఁ దిరిగి
నానాగడ్డి కఱచు.
నుడువరా సంతటి గోడు గుడుచు.
ఈ కఱవుదినములలోఁ బ్రజ లందఱు అల్లాడి ఆకులు
మేయుచున్నారు.
అల్లారుబెల్లము
మిక్కిలి ప్రియము
క. అల్లారుబెల్లమై గలు
గల్లున నందియలు మొరయఁగా వేడుక పె
న్వెల్లి మునిఁగించె ధరణీ
వల్లభనందనుఁడు చూచువారల చూడ్కుల్.
రాజశే. 2. 5
అ. ఎల్ల బంధువులకు నల్లారు బెల్లమై
యరిది గారవంబు నతిశయిలఁగఁ
దల్లిప్రేమ కరముఁ దనరా రె ముంగిటి
ముత్తె మగుచుఁ క్రొత్తక్రొత్త సిరుల.
కళాపూ. 6. 197
అల్లారుముద్దు
అల్లారుబెల్లము, మనోహరము,