పుట:TellakagitaM.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందించిన కౌగిలింత నేను గాల్లోకి తేలినంత
కలిసి చేసిన గైహికాల్లో, ఆటల్లో చెదిరిన ఇంటిపనిలో
చెరగని చిరునవ్వు వెనక.. అబద్ధాల అలక వెనుక
రెట్టించిన శ్రమ తనది.. కొలవలేనితనం నాది
కాలంతో పాటు నా కౌమారం కరిగింది
ఆమేం చెప్పినా వినని అహం కలిగింది
అనుబంధాల ఉన్నతి కానని అల్పత్వం పెరిగింది
గడచిన కొద్దీ ఆమె వడిలింది నా ఈడు మరి వంగనంది
నా మంచే ఆశించి చదవమనేది చెంత చేరి
పెడచెవిన పెట్టా.. అప్పట్లో మరెందరో ‘ఆమె’లు నాతో
అందులోన ఒకరిని కోరుకున్నా తోడుగా
మమత లేని లోకంలో నా వలపుల తలపులు
మారిపోయా మరికాస్త ఆమె నేర్పని విద్యలతో
హత్తుకోవాలని ఆమె ఆశ.. తప్పుకు తిరగాలని చూశా
చూశా ఆమెను చీదరగా.. హేయంగా
ఎప్పటిలా ఎదురుచూపుతో ఆమె గుమ్మంలో ఆత్రంగా
ఇంటిపట్టు ఉండకుండా చిల్లరగా తిరుగుతుంటే
తిట్టాలని తనకున్నా ఒక్క మాట అనలేదే!
ఎప్పటికైనా మారక పోడనే ఆశ తనకు చావలేదే!
నాకేమి లెక్క!! ఎపుడో నేనెదిగిపోయా
నాది కాని లోకంలో నేనేమో ఒదిగిపోయా
నాకూ తనకీ నడుమ ఒరుసుకునే ఓ నది ఉంది
వదిలేశా ఆమెనిపుడు.. ఎదిగేందుకు నాకొక పని ఉంది.
చిన్నగా నేనున్నప్పుడు తన అహమహమిక చంపుకుంది
పట్టింపులు లేవు నాకు నాలక్ష్యం నాకుంది
ఊరు నాది మారింది నేను తనతో ఉండరాక
ముసలిదైన మనిషి మీద అణుమాత్రం జాలిలేదు
నా అవసరమిపుడే తనకున్నా నే దొరకనంత దూరాన
అంగడి వేలంపాటలో పడివున్న చెడ్డవాడ్ని
ఒకటో రెండో ఏళ్ళల్లో ఒకటి రెండయ్యే ఇంటివాడ్ని
అప్పుడేమీ ఉండదుగా ఈ మాత్రపు ఝంఝాటం
నేనేమో కొడుకుని.. ఆమె నా కన్నతల్లి