పుట:TellakagitaM.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమె నా..

నే పుట్టినప్పుడే.. ఆమెకు పాతికేళ్ళు వచ్చాయి
మేము మేమే కానీ మేమిరువురమూ ఒక్కరమే
నా ఏడుపు ఘోష వేరు.. ఆమె లాలించే భాష వేరు
నేను నేర్చిందేం లేకున్నా.. నేర్పిస్తూ అలవలేదు ఆమెన్నడూ
నేను ఏడ్చినా, పక్క తడిపినా మాయమయ్యేవి ఆ రూపాలు
అవి నా చుట్టూ నించొన్న బుగ్గల్లాగే భూతాలు
పరిగెత్తుకొచ్చి.. పొదివిపట్టి లాలనలో ఆమె
ఆ చేతుల్లో వొదిగినపుడు ఒప్పులకుప్పను నేనే
చీకడం నడవడం నేర్చానేనపుడు..
ఆమెతో అనుబంధపు వయసు రెండేళ్ళూ
ఒకరికొకరం అర్థమవుతున్న తరుణంలో.. నేనే ఆమె సర్వస్వం
ఆమెకు ఇంకేమీ అక్కర్లే ఈలోకంలో
నడవబోతూ పడిపోతున్నా మరి..
తెలిసిందిగా తను నాతోనే ఉందని
తగిలేదెబ్బల భయం లేదిక
మాటలే ఒకరివి ఒకరికి అలవాటు కాలేదింకా
అవసరాలు మాత్రం అవగతమౌతున్నాయ్.
ఇప్పుడేమో నేనింక పక్షిలాగ తిరగగలను
రెండు దాటి మూడొచ్చి మాటలొచ్చి ఆటలొచ్చి
బడి అనే కొత్తలోకపు చదువుల జీవితం నన్ను మార్చి
తయారు చేసేది నన్ను పాలనురుగు తార లాగ
వచ్చాకా బడినుండి గంటైనా ఉతకాలి చాకి మురికి వదిలేలా
ఒళ్ళంతా తోమి నిమిరి దెబ్బ కట్టు కట్టాలి
ఆమె నా రేవు తీరం నా మనసే నావ చుక్కాని
నాకింకా గుర్తే నాలుగేళ్ళ వయసప్పుడు
ఎవరి చొక్కా చించానో .. ఇంటి మీద గొడవకొస్తే
 మాట ఎవరు పడ్డారో ఆటల్లో ఆలస్యం
 ఇంటి బాట నడచినప్పుడు
ఎదురుచూపు గుమ్మానిది బెదురుచూపు ఆమెది.
కళ్ళారా కానరాగా చేతుల్లో చేరగా