పుట:TellakagitaM.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఓ సరదా దండకం.. సీరియస్ గా

శ్రీమన్మహారాజ విఘ్నేశ్వరా నిన్ను ఈరీతి పూజింప ఓ రోజు ఉంటుందనీ నాకెపుడు ఊహన్ కూడ ఆలోచన లేదు కానీ రేపు నీదు బర్త్ డే అని అందరున్ చేస్తున్న హడావిడిన్ నే చూస్తున్న.. నిన్నున్ పెద్ద పెద్ద రూపాల విగ్రహాలన్ ఏర్పాటు చేసి లారీలు ఆటోల కెక్కించి రోడ్డుపై తారాడు బుడతలన్ పెద్దలన్ చూసి, రాయాలని బుద్ధిపుట్టి చందస్సు లేకుండా రాసేటి ఈ పిచ్చిరాతను భక్తితో వినమని కోరెదన్ హలో వినాయకా!.. ఓ పెద్ద బొజ్జయ్యా! ఓ సున్నపు ముద్దయ్య ప్రకృతిన్ పాడు సేయ నీ బొమ్మ చేశాము గొప్ప రంగులేశాము జై జై వినాయకా జై గణేశ అని ఎంత పొగడినన్ వేడినన్ ఈ లోకంబునందు నీవు చేయ పనుల్లో మిగిలుందిలే హుస్సేను సాగరును అందులో నీటిని బాగు చేయడం తీరిగ్గ నీ తలను ఆంచీ, నీ కాళ్ళను ఒళ్ళును బొజ్జనూ ముంచిఉన్న నిను గాంచితిన్ ఒక్క లడ్డును తప్ప నీవు ముల్గంగ చూసినా చేసినా పుణ్యమటుంచు పర్లేదు గానీ నీ తోటి హుస్సేను సాగరున నీటిలో పొరపాట్న కాలుగాని పెడ్తినా వచ్చు దురదలన్ పోగొట్ట నా డబ్బులున్ చాలక ఉన్న జబ్బును వదుల్చుకోలేక నిను వేడ వచ్చితిన్ నా కాలు గోకినన్ తిక్క తీర తొక్కూడి బొబ్బొచ్చి పుండై నా కాలు నాది కానటుల అనిపించిన పరిస్థితిన్ పక్కనన్ పెడితేన్, నిన్నూహించ నవ్వొచ్చె నాకున్ చేతులేమాత్రం ఖాళీగ లేకుండ నిన్నటుల వీక్షించి.. నా స్థితియే బాగని భావించి; నువ్వెటుల గోక్కుందువో.. నీ కష్టముల్ తీర్చ కైలాస వైద్యుడెవ్వడని చింతించ తలచితిన్ చూచితిన్ ధన్వంతరిన్ నీదు పూజలో నీ భక్తిలో వైద్యార్థివై నీరాకన్ కానక నీదురదన్ నేరక నీకొక్క టెంకాయనున్ కొట్టి ఉండ్రాళ్ళను పెట్టి ఊహలో సంతోషితం చేసి పరివారమున్,బంధు మిత్రులన్ కూడియుండగా నీ వళ్ళు మండి..నీదురదన్ పెరిగి.. నీ చేతిదంతంబు చేగోకి చూడగా.. ఇది యేదో బాగున్నదనిపించి నువు చేతలున్ పెంచగా నీ పెయ్య పై పడ్డ గీతలున్ నామాలు గా మారగా.. నీ తండ్రి సంతసింప.. నీ బాధ ఉపశమన మంత్రంబు బోధించి శివున్ నీ మొరాలకించినట్లుగా చేయ.. మాకేది దిక్కు మరి అని అడిగెద నిను.. ఓ వినాయకా! దయతో మము మార్చు.. వచ్చే యేడాదికైనా మేమంతా రంగులన్ మాని అంత పెద్దగా అందునా సాగరునన్ ముంచక నువ్ మట్టివై, చిట్టివై ఆకులో చేతిలో చేరునటుల నీ సైజు తగ్గించి చేయునట్టూ దీవించవయ్యా మహానుభావా పెరటిలో నుయ్యిలో లేద మంచినీటి కుండలో నిను కలిపి నీ ఇంటికిన్ పంపెదన్ ఈ జన్మకూ ఏ జన్మకూ సాగరు జల శుద్ధి నీవల్లను, నీ బాబు వల్లను, మా దొరలవల్లనూ కాదన్నదీ నిశ్చయం. ఈ మురికి గాలుల్లో ఈ కుళ్ళు నీళ్లోల్లో తిరిగేటి ఖర్మ నీకు తప్పాలనీ.. ఓ తండ్రీ! మాకు తప్పని పని యని అనుకుంటూ.. నమస్తే.. నమస్తే నమస్తే నమః