పుట:TellakagitaM.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వదులితే చెబుతా.. జీవిత సత్యాలు చేతిలో ఒకటి; చెట్టున రెండు
అంటూ చెప్పింది సూత్రం ఒకటి:
మనకు నచ్చింది పోయినా
వెళ్ళిపోయినా పోనీ మర్చిపో ఏదో ఓ రోజు ప్రతీదీ పోయేదే
వదలడా మరి అంత చెప్పాకా!!
మంచి మాట ఒక బతుకు విలువ
ఎగిరి.. పిట్ట అరిచిందిలా “అసాధ్యపు పనులౌతాయన్న అసత్యాన్ని నమ్మకు..”
చెట్టుమీద వాలి అంది “నను చంపితే దొరికేది మణుగుడు బంగారం కడుపులో మరి”
నిరాశతో అడిగాడు మూడో సూత్రం ముందు చెప్పమని..

కిచ కిచలాడిన పిచ్చుక ఇప్పుడు దెప్పింది
“మొదటి రెండూ మరచినోడికి మూడోది ఎలా ఉపయోగం!!”
పిడికెడు లేని పిట్టపొట్టలో మణుగుడు పుత్తడి ఉండేదెలా??
చేతిలో లేని పిట్ట ఎక్కడుంటే ఏం!!
పోతే పోనీ.. మనదేదీ పోలేదుగా!!
(*..౨,౩)

నల్కిస్.. నల్కిస్..

నలికిరప్ప నలికిరప్ప.. నావైపు రాకు.. నా పేరు.. నాగప్ప
నల్కిస్ నల్కిస్ నాపేరు రాందాస్
నన్ను చూడమాకు.. నావైపు రాకు
నువ్ పాడించిన పాట కదా!
గుంటూరైనా.. గురజాలైనా కనిపించేవు ఆనాడు.
గుడుగుడు కుంచంలా తలపుల్లోనే మిగిలావు
నువ్వూదితే బిందెడుపాలు తాగాలనడం
ఆ నాటి మాకవిత్వం కాదా! తెలంగాణాలో పాలబిందె,
నడుకుడి పింజ; రాయల సీమలో నలికిరప్ప, పల్నాడులో నల్కీస్,
ఉత్తరాంధ్రలో బిందె పాము.. ఎన్ని పేర్లున్నాయ్ నీకు
నలికిరి పామూ!! కనిపిస్తే పారిపోయే నీకు మేమేమి చేసాము?
కనపడకుండా పోయావు!!
ఏ ముంగీస తినేసిందో.. మా తలపులని..
ఉడతా, పిచ్చుకలతో పాటు కనుపరుగైపోయావు..
జీవ వైవిధ్య సదస్సుల్లో
కనీసం మావాళ్ళకు బొమ్మగానైనా గుర్తొచ్చావా!
మా చిన్నారి తరానికి అందమైనా జుగుప్సగానైనా తలపిస్తావా!!