పుట:TellakagitaM.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇదేం న్యాయం దేవుడా?

రాసిందే రాయడానికి తలదించట్లేదు నేను
ఎప్పటిలానే.. తలవంచే రాస్తున్నా..
చేసిన తప్పు చేయడం నీకు తప్పనపుడు
రాసిన రాతే రాయడం నా తప్పెలా అవుతుంది!
అడిగిన ప్రశ్నే అడగడం నాకు తప్పదులా ఉంది.
ఆరోజు వైష్ణవి.. ఈరోజు సాన్వి.. మధ్యలో తెలియనివి ఎన్ని!!
పేర్లేమైతేనేం తలతిక్క లెక్కలు నీవి
నా ప్రశ్నకు జవాబు చెప్పలేక తప్పుకు పోయావు
ఒకే బొమ్మలా ఇంకోటి మరోటీ చెయ్యడం వచ్చా నీకు
ఎవరిని చూసి మైమరవాలి ఈ వెతల్ని! కడుపు కోతల్ని!!
సైదుబాబు పాపం పండాలంటే 25 ఏళ్ళు నిండాలా!!
సాన్వి పాప 10 నెలలకే నీ ఇంట కొలువుండాలా?
మా కళ్ళన్నీ.. నీళ్ళతో నిండాలా!!
ఇదేం న్యాయం దేవుడా?
నీ బండబడ.. నీకు తెలియదు.. ఇది మాకో అంటురోగం
చరిత్ర కాలిన మచ్చల్లో పశుత్వం పాఠాలు నేరుస్తుంది.
గడి తప్పిన తప్పుల తడకల బడి మా లోకం
క్రియేటివ్ గా క్రిమేషన్ చేసే పోటీల్లో ఎవడికి వాడే సాటి
కిడ్నాపర్ ఎవడైతేనేం చంపడంతోనే ముగిసేది స్టోరీ
Marzipan పసిపిల్లల బొమ్మల్ని దాచుకునే వాళ్ళనుంచి
కేకుల్లా చేసుకుని కొరుక్కు మింగే వాళ్ళ వరకూ కన్నతండ్రివి.
ఎందరి ఇష్టాలని నువ్వు చూస్తావ్.. ఎవ్వరి మాట కాదంటావ్!!
పక్కోడూ బాగుండాలనుకున్నామా. .
రేపటి రోజు వార్తలకు ఈ రోజే రక్తపు రంగు పూస్తావ్
పసిమొగ్గల్ని తుంచేసి..తల్లి తీగకు కడుపు కోస్తావ్
తలతిక్క లెక్కలు నీవి..
ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తావ్?
ఇదేం న్యాయం దేవుడా? (ఏదో కారణంగానే.. ఇదీనూ)