పుట:TellakagitaM.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంకేం కావాలి!

చూస్తాం.. లోకం.. ఆ క్షణమంతా మనదే..
లోకమా క్షణమా ఏమో.
నచ్చిన రంగులుంటాయ్.. మనల్ని కావాలంటాయ్
రంగవ్వాలా! నచ్చాలా!! ఏమో.
వెచ్చని ఆలోచనలుంటాయ్ లోనికి రమ్మంటాయ్
ఆలోచనలనా! వెచ్చదనాన్నా! ఏమో.
చిక్కని జవాబులుంటాయ్ కనుక్కోమంటాయ్
కనుక్కోవాలా! అడగాలా! ఏమో.
విప్పని ముడులుంటాయ్ చేయి చేసుకోమంటాయ్
ముడులనా .. వాటి జడలనా ఏమో.
కొన్ని కోరికలుంటాయ్
చూడాలని.. వినాలని .. ఆఘ్రాణించాలని.. స్పృశించాలని
రుచిచూడాలని.. ప్రేమించాలని కో రాలా!! కోర పీకాలా ! ఏమో.
పుట్టినప్పుడు ప్రతీదీ అందంగానే ఉంటుంది.. పసిపాపలా.
ఆ క్షణంలో అదే లోకం..
లోకంలోకి అందమైన దాన్ని వదిలేయ్..
నీకు నచ్చినట్టు రంగరించు.. ఇచ్చేయ్..
నీ రంగులతో లోకం నింపు.. ఇంకేంకావాలి!
లోనికి వచ్చిన ఆలోచనల వెచ్చదనాన్ని పంచు
జవాబు అడుగు.. దానికదే కనుక్కుంటుంది ప్రశ్నని
జడపట్టుకో ముడి పట్టుబడిపోతుంది తాడో-పేడో తేలిపోతుంది
కోరికలూ!.. మీ మూలాలు వేరు లోనికి చూస్తావా..
బయటదారులు కనిపిస్తాయి. మనసుకి మార్గాలుంటాయి.. గొళ్లాలుంటాయ్ తెరిస్తే బయటవాటిని లోపలే చూపిస్తాయి
బయటవెతికావో నిను లోపలపెట్టి చీకటి పాల్చేస్తాయి.

చీకటిని నీ వివేకంతో కాల్చేయ్..
మనసంతా నీ ప్రపంచమౌతుంది..
ఈ ప్రపంచానికే నీమీద మనసౌతుంది.
ఇంకేంకావాలి!! (ఓ నిరాశావాదికి..)