పుట:TellakagitaM.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉప్ప ‘ధనం’

నా ఉద్వేగం ఎక్కడ ఎందుకు అంకురించినా
ఎర్ర మందారాల్లాంటి నెత్తురు కణాలను
తెల్లమల్లెల్లాంటి కన్నీరుగా చిలికించినా
మారని గొప్పతనం నాలో ఉప్పదనమే
నా స్వేదం ఎక్కడ ఎందుకు చిందించినా
నిర్వేదం నుదుటన నాట్యం చేస్తున్నా
నీరు చల్లినట్టుగా రగిలి పొగలు కక్కించేదీ..
మారని తరాల స్వరాలని బయట తడిపి
లోన చల్లబరిచేదీ ఈ ఉప్పదనమే
మనసు కరిగించే ఉప్పు .. మంచు కరిగించే ఉప్పు
ఈ తెల్ల బంగారం ఖరీదు మనిషి నిలువెత్తు
పుణ్య పురుషులు కర్పూరాలో కాదో.. ఏమో.
నా మనుషులు ఈ రస కర్పూరాలే.. చిటపట జ్యోతుల హారతులే మనిషి జీవించివున్నాడంటే.. కష్టాల కొలిమిలో
ఉప్పు.. నిప్పుతో చిటపటలాడ్తున్నట్టే
ప్రేమ పాశంలో పడి.. నీరుగారి కరిగిపోతున్నట్టే
ప్రేమ తియ్యదనంలో కలిసి.. మనసు నిర్జలీకరణాన్ని నిరోధిస్తున్నట్టే
ప్రేమంటే ఏదో ఓ రుచి కాదు.. జీవితం-రుచి తెలిసిన
కమ్మని కూర.. అమ్మ అప్పుడే పట్టిన ఆవకాయ పచ్చడి
ప్రేమంటే జీవన రసధుని మధుర భావనా లాహిరి
జీవితం ఆ ప్రేమ కోరే మనసు చేసే సాగర ఘోష
సాగర తీరాల అవతలి జీవితాలూ ఉప్పనే నేస్తమా!
ఆకర్షణల ఉప్పెనల తీపిని పంచకు..చితిమంటల ప్రేమను తియ్యగా ఎంచకు.. ఆకురాయి అగ్గిరవ్వలను కళ్ళతో ఒంపకు
ఉప్పదనం లేని చోట జీవితం చప్పగానే ఉంటుంది
గొప్పతనం కోరే మనసుకు నా మాట ఉప్పగానే ఉంటుంది
వడ్డించిన విస్తరిలా ఉండదు జీవితం ఎన్నడూ
అయిన కూట్లోకి అయిన కూర ఉంటే చాలదా
సమన్వయం లేకపోతే జీవితం.. ఉప్పులేని చప్పిడిమెతుకుల ముప్పై.. తిప్పలు పెడుతుంది (ఆర్వీఆర్ గారి పాఠాల్లో సారాన్ని వండి...)