పుట:Tatwamula vivaramu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవరాసులను అండ పిండమని పిలుస్తు, అతి పెద్దవైన బలమైనవైన ఐదు జీవుల్లను బ్రహ్మాండమని పిలుస్తున్నాము. మొత్తము విశ్వమంతటిని ఒక్క మాటలో అండ, పిండ, బ్రహ్మాండమని అంటున్నాము. చాలామందికి కొన్ని జీవరాసులు తెలుసు కొన్ని తెలియవు. కొందరికి అండపిండమైన జీవుల్లు తెలిసిన బ్రహ్మాండమైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కూడ జీవుల్లని తెలియదు. అందువలన అండ పిండ బ్రహ్మాండము తెలియని మాకు అని ఈ వ్యాకములో చెప్పబడియున్నది.


అండ పిండ బ్రహ్మాండమని విశ్వమంతటిని కలిపి అంటున్నాము. విశ్వమంత వ్యాపించియుండి విశ్వమంతటికి ఆధారమై కనిపించనిది ఒకటున్నది. దానినే దైవము అంటున్నాము. వెతికిన కనిపించనిది కావున దేవుడు అంటున్నాము అది స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు కావున కనిపించనిదని కనిపించనివాడని రెండు రకములుగ అంటున్నాము. అండ పిండ బ్రహ్మాండమును సృష్ఠించి పోషించువాడు దేవుడు. దేవుని చేత సృష్ఠింపబడిన అండ పిండ బ్రహ్మాండమే మనకు అర్థము కాలేదు. ఇక దానిని సృష్ఠించిన దేవుడు ఎంతటి వాడో, ఎటువంటివాడో ఎవరికి తెలియదు. అండ పిండ బ్రహ్మండము ఏమిటో, దానిని సృష్ఠించిన వాడెటువంటివాడో, కొంత వివరము తెలుపమని గురువును కోరినట్లు పై చరణములో గలదు.


 5) పుట్టలోని పామును పట్టే విధము తెలియని మాకు
పామును పట్టే కట్టు మంత్రము తెలుపమని కోరితివిూ

పాము బుసకొట్టే స్వభావము కలది. పాము పుట్టలలో నివాసముంటాయని అందరికి తెలుసు పుట్టలోని పామును పట్టాలంటే కొంత నేర్పరితనము కావాలి. ఆ నేర్చుకోవడము అంతకు ముందు