పుట:Tatwamula vivaramu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేర్చుకొన్న వాని దగ్గరనుండే నేర్చుకోవాలి. పామును పట్టుకోవాలంటే దానిని కట్టడి చేయు మంత్రమును తెలుసుకోవలసియున్నది. ఆ మంత్రమును నేర్చుకొనుటకు ఒక మంత్రగానిని ఆశ్రయించవలసిందే. ఇదే విధానము ఆత్మజ్ఞానములో కూడ కలదు. అదేమనగా పుట్ట అనగ శరీరమని తెలియవలెను. పుట్టలోని పాము అనగ శరీరములోని ఆత్మ అని తెలియవలెను. శరీరమను పుట్టలో రెండు రకముల పాములు గలవు. ఒకటి చలాకిగవుండి పుట్టంతయు తిరుగుచు బుసకొట్టుపాము, రెండవది మజ్జుగ ఒక చోటనేవుంటు బుసకొట్టని పాము. రెండు పాములను రెండు ఆత్మలని అనవచ్చును. ఒకటి చురుకుతనము కల్గి కదలుచున్న బుసకొట్టు నాగుపాము. రెండవది చురుకుతనము లేకుండ కదలకుండ బుసకొట్టకుండ ఉండే పూడుపాము. బుసకొట్టే పాము చైతన్యముగల ఆత్మ అనియు, బుసకొట్టని పామే చైతన్యములేని జీవాత్మ అనియు చెప్పవచ్చును. బయట గల మట్టిపుట్టలో ఒకపాము ఉండవచ్చును, కాని శరీరమను పుట్టలో ఎప్పటికి రెండుపాములే ఉండును. మట్టి పుట్టకు రంద్రములెన్ని అయిన ఉండవచ్చును, కాని శరీరమను పుట్టకు తోమ్మిది రంధ్రములు మాత్రమే ఉండును. ఈ విధముగ బయటి మట్టి పుట్టకు శరీరమను పుట్టకు తేడాలు గలవు.


ఆధ్యాత్మిక విద్యరీత్యా ఇక్కడ విశేషమేమిటంటే రెండవదైన బుస కొట్టని పూడుపాము మొదటిదైన బుసకొట్టు నాగుపామును అదిమి పట్టాలి. అనగ కదలని పాము కదిలెడి పామును జయించాలి అని అనుకొందాము. పూడుపాములమైన మనము అనగ శరీరములోనే నివశించు జీవాత్మలము. జీవాత్మతోపాటు శరీరములోనే ఉండి శ్వాస అను శబ్దముతో బుసకొట్టు ఆత్మను తెలుసుకోవాలి. కదలికలేని జీవాత్మ కదలికయున్న ఆత్మను