పుట:Tatwamula vivaramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎక్కే మార్గము తెలియని మాకు కంటకములులేని మార్గము తెలుపమని కోరితివిూ" అని గలదు. పూర్వకాలము జ్ఞానుల ఉద్దేశము ప్రకారము ఏడుకొండలు అనగ మన శరీరములోని ఏడు నాడీకేంద్రములని అర్థము. శరీరములోనే ఆత్మలు నివశిస్తున్నవి. అందులన శరీరములోనే ఆత్మజ్ఞానము కలదు. ఆత్మజ్ఞానము ప్రకారము ఏడు నాడీకేంద్రములను ఏడు ద్వారములుగ, ఏడు కొండలుగ పోల్చి చెప్పారు. శరీరములోని ఆరు నాడీకేంద్రములను అతిక్రమించి ఏడవ నాడీకేంద్రమైన మెదడు భాగములో గల ఆత్మను తెలియవచ్చును. శరీరములో మనస్సును నిరోధించి బ్రహ్మయోగము చేయు యోగులకు అది సాధ్యమైన పని. శరీరములోని ఏడు కొండలైన ఏడు నాడీకేంద్రములను ఎక్కే విధము వివరము తెలియని అజ్ఞానులైన మాకు పూర్తి జ్ఞానము కల్గించి సంశయములను ముల్లులులేని మార్గములను తెలుపమని గురువును కోరినట్లు ఈ వాక్యములోని వివరము.


 4) అండ పిండ బ్రహ్మాండము తెలియని మాకు
అంతనిండియుండే వానిని తెలుపమని కోరితివిూ

అండము అనగ గ్రుడ్డు, పిండము అనగ గర్భము. కనిపించెడి కదలుచున్న జీవరాసులలో కొన్ని అండమునుండి పుట్టుచున్నవి, కొన్ని గర్భమునుండి పుట్టుచున్నవి గలవు. భూమి మీద చరించు జీవరాసులను అన్నింటిని కలిపి అండజములు, పిండజములు అని అంటున్నాము. అంతేకాక కనిపించని జీవరాసులైన సూక్ష్మక్రిములు చలించని జీవరాసులైన చెట్లు ఎన్నో గలవు. మొత్తము విశ్వమంతటిని లెక్కించి చూచితే ఈ జీవరాసులే కాక ప్రకృతి అయిన మహా భూతములనబడు ఐదు పెద్ద జీవులు కూడ కలరు. చిన్న జీవరాసులైన చలించు