పుట:Tatwamula vivaramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. నీల్లలో మునిగి గొనుగుచుయుంటే నిలకడ చెడునుర ఒరే యొరే
నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే ||చి||

కొందరు మంత్రోపదేశములను పొంది ఆ మంత్రములను నియమము ప్రకారము జపించుచుందురు. అటువంటి నియమములలో నీటిలో గొంతువరకు దిగి లేక నడుముల వరకు దిగి జపించవలెనను పద్దతులుండును. అట్లు జపించుటవలన మంత్రము మీద ద్యాస పెరుగునని వారి నమ్మకము. ఈ విధముగ నీటిలో దిగి మంత్రజపము చేయుట వలన, నీటిలో మునిగి శివుని జపము చేయుటవలన లేని ఆస్తమ (ఉబ్బస) రోగము వచ్చును కాని మనసు కుదుటపడదు. ఏమాత్రము జ్ఞానము అభివృద్దిచెందదు. అట్లు బయటి పూజలకు జపములకు అలవాటుపడుట వలన మన శరీరములో ఉండే నిర్మల జ్యోతియైన పరమాత్మను తెలియలేము. దేవుడు తెలియాలంటే నిజమైన భక్తి అవసరము. ఆ నిజమైన భక్తి మన శరీరములోని దైవము మీద చూపడమే సరియైనది. అట్లుకాక బాహ్యాచరణ వలన, అన్యదేవతల ఆరాధనల వలన ఎవరికి అంతరంగములోని దేవుడు తెలియడు. అందువలన ఈ తత్త్వములో నీల్లలో మునిగి గొనుగుచువుంటే నిలకడ చెడునుర అన్నారు. అంతేకాక నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే అన్నారు.


3. బాధ గురువుల పంచను జేరితే భావము చెడునుర ఒరే యొరే
భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే ||చి||

ఇప్పటి కాలములో భూమి మీద రెండు రకముల గురువులు గలరు. ఒక రకము బాధ గురువులు, రెండవ రకము బోధ గురువులు. శరీరమునకు పని కల్పించి దానిద్వార దేవున్ని తెలుసుకోవచ్చునని