పుట:Tatwamula vivaramu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవజ్ఞానము తెలిసినవారు చిల్లర దేవుల్ల వ్యామోహములో పడక, కనపడిన ప్రతి బొమ్మకు మ్రొక్కక, శరీరములోనే దేవుడున్నాడని, మిగతవారు అసలైన దేవుడు కాలేరని, శరీరములోనే దేవున్ని తెలుసుకొనుటకు ప్రయత్నంచు చుందురు. అటువంటివారు చిత్తములోని చిన్మయజ్యోతిని చూచుకోవడమే మంచిదని తెలిపారు.


1. ఒక్క ప్రొద్దులని ఎంచుచుయుంటే ఒనరుగ చెడుదువు ఒరేయొరే
ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే ||చి||

శరీములోని పరమాత్మను తెలుసుకొను జ్ఞానములేనివారు శరీరము నకు బయటగల ప్రతిమలను అనేక దేవుళ్ల పేరుతో ఆరాధించుచుందురను కొన్నాము కదా! అటువంటి ఆరాధనలలో ఉపవాసములు ఉండుట కూడ కొందరు చేయుచుందురు. ఉపవాసముల వలన ఆరోగ్యమే చెడునుకాని శరీరములోని దేవుడు తెలియడు. ఉపవాసముల వలన ఆత్మకు శక్తిలేకుండపోవును. ఆత్మ బలహీనపడును. అందువలన ఆత్మను ఇబ్బంది పెట్టినవారమగుదుము. ఇదే విషయమునే భగవద్గీతలో శ్రద్దాత్రయయోగమను ఆధ్యాయములో 4,5,6వ శ్లోకములలో ఇతర దేవతల పూజచేయువారు అశాస్త్రీయపద్దతులను ఆచరించుచు, వారు బాధపడునది కాక వారిలోపలనుండు నన్ను కూడ బాదింతురని దేవుడు అన్నట్లు కలదు. కావున ఉపవాసముల వలన తానైన జీవాత్మ బాధపడునదే కాక లోపలయున్న ఆత్మను కూడ బాధించినవారమగు చున్నాము. అందులన ఉపవాసముల వలన ఏమి ప్రయోజనములేదని తెల్పుచు ఒక్కప్రొద్దులని ఎంచుచువుంటే ఒనరుగ చెడుదువు అని పై తత్త్వములో చెప్పారు. అంతేకాక అంతట వ్యాపించివున్న పరమాత్మను తెలియడమే మంచిమార్గమని తెలుపుచు ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే అన్నారు.