పుట:Tatwamula vivaramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెల్పెడివారు బాధ గురువులు. శరీరమునకు బాధను కల్పించు వారందరు బాధ గురువులే. ఉదాహరణకు దేవుని ప్రతిమకు ప్రదక్షణలు చేయమని చెప్పెడి గురువులు బాధగురువులే అగుదురు. అట్లు ప్రదక్షణము చేయడము పని అగుచున్నది దానివలన శరీరమునకు శ్రమ ఏర్పడు చున్నది. ఈ విధముగ శరీరముతో చేయు ఆరాధనలను చెప్పువారు కాని, మంత్రము చెప్పు గురువులుకాని బాధగురువులే అగుదురు. ఈ విషయమునే వేమనయోగి తన పద్యములో


కర్మల చెప్పువాడు కడగురుడు
మంత్రము చెప్పువాడు మద్యమ గురుడు
ఊర కుండుమనువాడు ఉత్తమ గురుడు
విశ్వదాభిరామ వినరవేమా.

అన్నాడు. శరీరశ్రమను కల్గించు బోధనలు చేయువారందరు బాధగురువు లని చెప్పడమే ఈ పద్యములోని అంతరార్థము. భక్తిలో పనులు చెప్పువారు తక్కువ గురువని, అలాగే మంత్రము చెప్పి దాని పనిలో ఉండమనువాడు మద్యమ గురుడని వేమనయోగి అన్నాడు. అట్లే శరీరముతో ఏ పనులు లేకుండ, మనస్సుతో కూడ పనిలేకుండ, ఏ సంకల్పము లేకుండ ఉండమని బోధించువాడు ఉత్తమగురుడని అతనే బోధ గురువని అట్లు చెప్పకుండ మనస్సుతోకాని శరీరముతోకాని పని కల్పించు బోధ చేయు వారందరు బాధ గురువులని చెప్పారు. అందువలన ఈ తత్త్వములో బాధ గురువుల పంచను చేరితే భావము చెడునుర అన్నారు. మనస్సును నిలిపి ఆత్మదర్శనమును చేసుకోవడము సరియైనపద్దతని తెలుపుచు భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే అన్నారు.