పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

97 రేకు: 0320-06 సామంతం సంపుటము: 04-117 పల్లవి: అందుల కిదె ప్రతియూషధము ఇందిరాపతికి నెక్కినచింత చ. పంచబాణములబాసట మంటిన చంచలమ నిశ్చలమనసు పంచబాణగురుపాదము దల(చిన కంచుఁజంచలము గక్కన మాను చ. కనకపుటాసలగరళం బంటిన ననిచినవిజ్ఞానము చెదరు కనకగర్భు నటు గన్నతండ్రిపై మనసిడితే నిర్మలమ గుణము చ. మునుకొని మొుదలను మొలచిన ససికిని పనివడి కొననే ఫలియించు అనయము శ్రీవేంకటాధిపుకృపగల - జనుని కిహపరము సఫలంబు రేకు:0312-06 ధన్నాసి సంపుటము:04-072 పల్లవి: అందులకు నందులకు హరిసేసినలంకే కందువసంసారమందే కలదు మోక్షము గాన చ. దేహ మోన్నాళ్లు దిరిగె భూమిమీఁద దాహపులంపటములతగు లన్నాళ్లు వూహించి విసుగవద్దు వొల్లనన్నఁ బోవవి శ్రీహరి నందే తలఁచి చెలఁగఁగవలెఁగాన చ. దీపనమోన్నాళ్లు మేనఁ దిరమై మెలఁగుచుండు తాపపుటాసల మీఁదితగు లన్నాళ్లు పైపైఁ గోపించరాదు పాయుమన్నఁ బాయ వవి శ్రీపతి నందే తలఁచి చెలఁగఁగవలెగాన చ. యెఱుకయొన్నాళ్లు మతి నెనసి పాయకయుండె తఱమేయింద్రియములతగు లన్నాళ్లే వొఱలి బంధించవద్దు వున్నతి శ్రీవేంకటేశుమఱఁగు చొచ్చి మఱచి మట్టుపడవలెఁగాన పె.అ.రేకు:0001-01 దేవగాంధారి సంపుటము: 15-001 పల్లవి: అందులకుఁగాదు నిన్నడిగేది ముందరి పనులకే మొక్కేఁ గాని చ. సకలలోకములకు స్వామివైన నీవు వొకని నన్నేల లేక వొల్ల ననేవా మొకరివై భూమెల్ల మోచి యుండిన నీవు ఆకట నాపరభారా లాఁప ననేవా చ. పలుజీవులకు నెల్ల ప్రాణమవైన నీవు వొలసి నాలో నుండ నొల్ల ననేవా కలిగి బ్రహ్మదులను కనిపెంచిన నీవు పెలుచనైన నన్నుఁ బెంచ ననేవా చ. వరుస నందరికిని వరదుఁడైన నీవు యిరవై వరము నాకు నియ్యననేవా యెరపు లేక శ్రీ వేంకటేశ నాకు నిహమెల్ల కరుణతో నిచ్చితివి కడమలు గలవా